RRR movie: రన్ టైం పై క్రేజీ గాసిప్... అమ్మో అన్ని గంటలా!

By team telugu  |  First Published Oct 25, 2021, 9:47 AM IST

ఆర్ ఆర్ ఆర్ ఏకంగా మూడు గంటలకు పైగా నిడివి కలిగి ఉంటుందట. కథ, కథనాల రీత్యా మూవీ రికార్డు రన్ టైం సాగుతుందని అంటున్నారు. సినిమాలో పాటలు కూడా పది వరకు ఉంటాయట. 


ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదలకు కేవలం రెండు నెలల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. వచ్చే ఏడాది జనవరి 7న RRR Movie థియేటర్స్ లో దిగనుంది. ఇప్పటికే మూడు సార్లు ఆర్ ఆర్ ఆర్ విడుదల తేదీ వాయిదా వేయగా, ఈసారి చెప్పిన ప్రకారం మూవీని విడుదల చేయనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ గ్రాండ్ గా సిద్ధం అవుతుంది. 
ఇద్దరు స్టార్ హీరోలు చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ రన్ టైం పై క్రేజీ గాసిప్ చక్కర్లు కొడుతుంది. 

ఆర్ ఆర్ ఆర్ ఏకంగా మూడు గంటలకు పైగా నిడివి కలిగి ఉంటుందట. కథ, కథనాల రీత్యా మూవీ రికార్డు రన్ టైం సాగుతుందని అంటున్నారు. సినిమాలో పాటలు కూడా పది వరకు ఉంటాయట. Ram charan, ఎన్టీఆర్ యాక్షన్ సన్నివేశాలు ఊహకు మించి తెరకెక్కించగా, సినిమా నిడివి చాలా ఎక్కువ అవుతుందని అంటున్నారు. సినిమా నిడివి ఎక్కువ అయినా, ప్రేక్షకులను ఎంగేజ్ చేయగల సత్తా రాజమౌళికి ఉంది. నిజంగా ఆర్ ఆర్ ఆర్ మూవీ నిగిడి మూడు గంటల కంటే ఎక్కువ ఉన్నా, బాధపడాల్సింది ఏమీ లేదు. Rajamouli గత చిత్రాలు బాహుబలి, బాహుబలి 2 కూడా మిగతా చిత్రాలతో పోల్చితే ఎక్కువ రన్ టైం కలిగి ఉన్నాయి. 

Latest Videos

undefined

Also read కొడుకు వరుణ్ తో దుబాయ్ ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న నాగబాబు... వైరల్ గా వెకేషన్ ఫోటోలు
పోరాటయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ ల జీవితాలు ఆధారంగా చేసుకొని, ఫిక్షన్ జోడించి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. అల్లూరిగా చరణ్, భీమ్ గా Ntr నటిస్తున్నారు. ఓ కీలక పాత్రలో అజయ్ దేవ్ గణ్ కనిపిస్తుండగా, అలియా భట్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు. రూ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రాజమౌళి బాహుబలికి మించి ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కిస్తున్నారు.

Also read ఇప్పుడు ఎన్టీఆర్ వంతు, ఇక విశ్వరూపమే.. రంగంలోకి బాలీవుడ్ డైరెక్టర్

 డివివి దానయ్య ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి నిర్మాతగా ఉన్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ ఫస్ట్ లుక్ ప్రోమోలు విడుదల కావడం జరిగింది. ఇద్దరి ప్రోమోలు ఒకరికిమించి మరొకరు అన్నట్లు, అంచనాలకు ఎక్కడా తగ్గకుండా ఉన్నాయి. బిజినెస్ పరంగా బాహుబలికి మించిన ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి వసూళ్లు  ఏ స్థాయిలో ఉంటాయో చూడాలి. 
 

click me!