మెగాస్టార్ తో పవర్ స్టార్ ముచ్చట్లు... పెళ్ళిలో కలిసి సందడి చేసిన మెగా బ్రదర్స్

Published : Oct 25, 2021, 01:59 PM IST
మెగాస్టార్ తో పవర్ స్టార్ ముచ్చట్లు... పెళ్ళిలో కలిసి సందడి చేసిన మెగా బ్రదర్స్

సారాంశం

రాజకీయవేత్త బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ మ్యారేజ్‌ రిసెప్షన్ హైదరాబాద్‌లో జరగింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ Chiranjeevi‌, పవర్‌స్టార్‌ హాజరయ్యారు.

మెగాస్టార్‌, పవర్‌ స్టార్‌ ఒక చోట చేరితే మెగా అభిమానులలో ఏర్పడే జోష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంత అన్నదమ్ములైనా... ఈ స్టార్ హీరోలు కలిసే సందర్భాలు చాలా అరుదు. ఫ్యామిలీ ఫంక్షన్స్ లేదా గెట్ టుగెదర్ పార్టీలలో కలిసి పాల్గొంటూ ఉంటారు. అయితే తాజాగా ఓ పెళ్లి వేడుకలో చిరు,  Pawan kalyan కలిసి సందడి చేశారు. పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ మెగా బ్రదర్స్ మధ్య జరిగిన మాటామంతి విశేషంగా నిలిచాయి. 


రాజకీయవేత్త బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ మ్యారేజ్‌ రిసెప్షన్ హైదరాబాద్‌లో జరగింది. ఈ వివాహ వేడుకకు మెగాస్టార్ Chiranjeevi‌, పవర్‌స్టార్‌ హాజరయ్యారు. ఆ సమయంలో కలుసున్నకున్న ఈ మెగా బ్రదర్స్‌ నవ్వుతూ పలకరించుకున్నారు.మెగా బ్రదర్స్‌ రాకతో ఆ ఫంక్షన్‌కి కొత్త కళ వచ్చింది. అనంతరం ఇద్దరూ కలిసి వధూవరులు, వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. అయితే అంతకుముందు పవన్‌ కల్యాణ్‌, తన అన్నయ్య చేతిలో చేయి వేసి నవ్వుతున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగా, అవి వైరల్‌గా మారాయి.

Also read Rakul preeth singh: ఆయన్ని పెళ్లి చేసుకుంటే రకుల్ జైలు పాలవుతుంది... వేణు స్వామి షాకింగ్ కామెంట్స్

అంతకు ముందు మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిశారు. స్వయంగా ఇంటికి వచ్చి బెస్ట్ విషెష్ తెలియజేయడం జరిగింది. ఇక అభిమానుల కోసం ఈ ఇద్దరు హీరోలు షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. చిరంజీవి ఆచార్య షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా Acharya విడుదల కానుంది. అలాగే గాడ్ ఫాదర్, భోళా శంకర్ చిత్రాలను ఆయన ప్రకటించారు. 


మరోవైపు పవన్ భీమ్లా నాయక్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. Bheemla nayak మూవీ షూటింగ్ సైతం చివరి దశకు చేరింది. అదే సమయంలో దర్శకుడు క్రిష్ తో చేస్తున్న హరి హర వీరమల్లు చిత్ర షూటింగ్ లో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. అలాగే హరీష్ శంకర్ భవదీయుడు భగత్ సింగ్, సురేందర్ రెడ్డి చిత్రాలలో పవన్ కళ్యాణ్ నటించాల్సి ఉంది. 

Also read RRR movie: రన్ టైం పై క్రేజీ గాసిప్... అమ్మో అన్ని గంటలా!

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హీరోకి రూ.110 కోట్లు, హీరోయిన్ కి రూ.2 కోట్లు.. ఏమాత్రం సంబంధం లేని రెమ్యునరేషన్స్ వైరల్
Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ రొమాంటిక్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. డీటెయిల్స్ ఇవిగో