
పవన్‌కల్యాణ్ కుమారుడు అకీరా నందన్ ఒక్క సినిమా కూడా చేయకపోయినా ఓ రేంజిలో క్రేజ్ ఉంది. ఆయన ఎప్పుడు హీరోగా లాంచ్ అవుతాడా అని పవన్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే అనుకోని విధంగా అకీర్ ఇప్పుడు సంగీత దర్శకుడిగా తొలి అడుగు వేశాడు. ఆసక్తికర కథాంశంతో తెరకెక్కిన ఓ చిత్రానికి అతడు సంగీతం అందించి ఆశ్చర్య పరిచారు.
రైటర్స్ బ్లాక్ అనే ఓ షార్ట్ ఫిల్మ్‌కు మొదటిసారి అతడు సంగీతం అందించాడు. ఇదే విషయాన్ని నటుడు అడివి శేష్ వెల్లడించారు. రైటర్స్ బ్లాక్ షార్ట్ ఫిల్మ్ లింక్‌ను ట్విట్టర్లో షేర్ చేశారు. టీమ్‌కు అభినందనలు చెప్పారు. తనకెంతో ఇష్టమైన అకీర ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడని పేర్కొన్నారు.
ఒక రచయిత.. కథను రాయడంలో సవాళ్లు ఎలా అధిగమించాడు అనే కథాంశంతో ఈ లఘుచిత్రం రూపుదిద్దుకుంది. ఇంగ్లీష్‌లో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు కార్తికేయ యార్లగడ్డ దర్శకత్వం వహించారు. మనోజ్ నటించగా.. ఫణి మాధవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఈ ప్రాజెక్ట్‌కు అకీరా మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. నాలుగున్నర నిమిషాల నిడివి గల ఈ ఫిల్మ్‌కు అతడు అందించిన మ్యూజిక్ ఆకట్టుకునేలా ఉంది.
గతంలోనూ రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు అకీరా నందన్ కి సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ ఉంటుంది.ఇది వరకే ఆయన కర్ర సాము చేసిన వీడియోలు మరియు కీ బోర్డు వాయిస్తున్న వీడియోలను తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ ద్వారా చాలానే షేర్ చేసింది.తమ అభిమాన నటుడి కుమారుడు ఎలాంటి మ్యూజిక్ అందించాడనే ఉద్దేశంతో చాలా మంది అభిమానులు ఆ వీడియోను ఓపెన్ చేసి చూస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ షార్ట్ ఫిల్మ్ కి వ్యూస్ తెగ వస్తున్నాయి.
ఏదో కాలక్షేపం కోసం మ్యూజిక్ ఇచ్చినట్టు కాకుండా ఒక ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా అకీరా నందన్ ఎంతో చక్కగా సంగీతం అందించాడు. రీ రికార్డింగ్, సౌండ్ మిక్సింగ్ కూడా అదిరిపోయిందని అందరూ మెచ్చుకుంటున్నారు..మరి కొందరైతీ మీ అబ్బాయి మ్యూజిక్ అదరగొట్టేసాడు. నీ తదుపరి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా నీ కొడుకు అకిరా నందన్ ని పెట్టుకో అన్నా అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్ లో ట్వీట్స్ చేస్తున్నారు. మరి పవన్ నిజంగానే అకీరాకు తన సినిమాలో అవకాసం ఇస్తారా ..ఏమో...