అఖిలే బెటర్.. చైతుని పక్కన పెట్టిన నాగ్!

By Udaya DFirst Published Apr 10, 2019, 9:54 AM IST
Highlights

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' సినిమాను తెరకెక్కించనున్నారు. 

'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకి సీక్వెల్ గా 'బంగార్రాజు' సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో నాగార్జున, నాగచైతన్యలను హీరోలుగా అనుకున్నారు. కానీ ఇప్పుడు చైతుకి బదులు అఖిల్ ని తీసుకుంటున్నారని సమాచారం.

దాదాపు నాగ్-అఖిల్ కాంబో సెట్ అయినట్లే అని అంటున్నారు. ఇందులో నాగ్ తాతగా, అఖిల్ మనవడిగా కనిపిస్తారట. ఈ పాత్రకి చైతుకంటే అఖిల్ అయితే బాగుంటాడని యూనిట్ భావిస్తోంది. 'మజిలీ' సినిమా సక్సెస్ తరువాత ఇలాంటి పాత్రకు చైతుని సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదని నాగార్జున స్వయంగా ఫీల్ అయ్యాడని టాక్.

ఇప్పుడు అఖిల్ కూడా ఖాళీగానే ఉన్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాకి డేట్స్ మాత్రమే ఇచ్చాడు కాబట్టి 'బంగార్రాజు' సినిమాకి కాల్షీట్స్ కేటాయించే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన త్వరలోనే రానుంది.

కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను నాగార్జున స్వయంగా నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం నాగ్ 'మన్మధుడు 2' సినిమాలో నటిస్తున్నాడు. అది పూర్తయిన తరువాత 'బంగార్రాజు' సెట్స్ పైకి వెళ్లనుంది. 

click me!