రివర్స్: జనసేన ప్రచారాల్లో అలీ తమ్ముడు!

Published : Apr 09, 2019, 09:36 PM IST
రివర్స్: జనసేన ప్రచారాల్లో అలీ తమ్ముడు!

సారాంశం

 సినీ రాజకీయాలు ఈ సారి ఊహించని షాక్ లు ఇస్తున్నాయి.  ఓ వైపు అలీ - పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంటే అలీ తమ్ముడు ఖయ్యుమ్ ఊహించని విధంగా జనసేన జెండా పట్టుకొని జోరుగా ప్రచారాల్లో పాల్గొన్నారు

తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే.. అన్న సామెత ఇప్పుడు ఎపి రాజకీయాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. సినీ రాజకీయాలు ఈ సారి ఊహించని షాక్ లు ఇస్తున్నాయి.  ఓ వైపు అలీ - పవన్ కళ్యాణ్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంటే అలీ తమ్ముడు ఖయ్యుమ్ ఊహించని విధంగా జనసేన జెండా పట్టుకొని జోరుగా ప్రచారాల్లో పాల్గొనడం అందరిని షాక్ కి గురిచేస్తోంది. 

అసలు విషయంలోకి వస్తే.. వైసిపిలో  చేరి అలీ వెన్నుపోటు పొడిచినట్లు పవన్ చేసిన కామెంట్స్ కు అలీ కూడా అదే తరహాలో అసలు నాకు మీరేమ్? చేశారు అని సమాధానం ఇవ్వడం హాట్ కాంట్రవర్సీగా మారింది. అయితే ఎన్నికల ప్రచారాలు చివరిదశలో ఉండగా అలీ తమ్ముడు ఖయ్యుమ్ నరసాపురంలో జనసేన పార్టీ తరపున ప్రచారం నిర్వహించాడు. 

అందుకు సంబందించిన న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక పవర్ స్టార్ అభిమానులు అలీ - పవన్ మధ్య జరిగిన డైలాగ్స్ వార్ కి చాలానే చింతిస్తున్నారు. రాజకీయాలు మంచి స్నేహితులను కూడా విరోధుల్ని చేస్తాయని కామెంట్ చేస్తున్నారు.  

PREV
click me!

Recommended Stories

Dhurandhar vs Avatar 3: అవతార్ 3కి చుక్కలు చూపించిన ధురంధర్.. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు
బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్