అక్కినేని అభిమానులు ఊపిరి పీల్చుకోండి

By Surya Prakash  |  First Published Dec 16, 2020, 10:17 AM IST

ఇప్పుడు ఈ సినిమా లాంచ్ అయ్యే రోజు తెలిసింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా సంక్రాంతి రోజు లాంచ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. తమన్ ని ఇప్పటికే ఈ సినిమాకు ఎంపిక చేసారు సురేంద్రరెడ్డి. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించనున్నాయి. 


అక్కినేని అభిమానులు ఆనందపడే వార్త వచ్చింది. ప్ర‌స్తుతం బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్‌` చిత్రం చేసిన అఖిల్ ఈ చిత్రాన్ని సంక్రాంతి రేస్‌కి రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనీల్ సుంక‌ర నిర్మాణంలో అఖిల్ తన 5వ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోతున్నాడు. దీనికి సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ ఇప్పటికే వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమా లాంచ్ అయ్యే రోజు తెలిసింది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా సంక్రాంతి రోజు లాంచ్ కానుంది. 

భారీ బడ్జెట్ తో రూపొందే ఈ సినిమాకు ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు. తమన్ ని ఇప్పటికే ఈ సినిమాకు ఎంపిక చేసారు సురేంద్రరెడ్డి. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ కలిసి ఈ సినిమాని నిర్మించనున్నాయి. 

Latest Videos

అలాగే ది బోర్న్ ఐడెంటిటీ సీరిస్ ఆధారంగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో అఖిల్ గూఢ‌చారి పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది‌. ఈ సినిమాకు రు. 40 కోట్ల బ‌డ్జెట్ దాకా  పెడుతున్నార‌ని తెలుస్తుంది. ఇకపోతే సురేంద్రరెడ్డి తన రెమ్యునేషన్ గా సినిమాలో పార్టనర్ గా ఉండబోతున్నట్లు చెప్తున్నారు. మరో ప్రక్క సురేంద్రరెడ్డి..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం మరో స్క్రిప్టుని రెడీ చేస్తున్నారట. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఆ సినిమా తెరకెక్కించాలనే నిర్ణయంలో ఉన్నారట.

click me!