ఆహ్వానం అందింది... అందుకే నిహారిక పెళ్ళికి రాలేదు

Published : Dec 16, 2020, 10:02 AM IST
ఆహ్వానం అందింది... అందుకే నిహారిక పెళ్ళికి రాలేదు

సారాంశం

మాజీ భార్య రేణూ దేశాయ్ నిహారిక వివాహానికి హాజరు కాలేదు. రేణూ దేశాయ్ కి నిహారిక వివాహానికి ఆహ్వానం అందలేదని... అందుకే తాను నిహారిక వివాహానికి వెళ్లలేదని ప్రచారం జరిగింది. ఈ పుకార్లకు రేణూ దేశాయ్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. నిహారిక వివాహానికి రాకపోవడానికి గల కారణం వివరించారు.   

మెగా కుటుంబం మొత్తం సందడి చేయగా నిహారిక వివాహం ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది. ఈ పెళ్ళికి మెగా కుటుంబం నుండి అందరూ హాజరయ్యారు. ఐతే పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ ఈ వివాహానికి హాజరు కాలేదు. రేణూ దేశాయ్ కి నిహారిక వివాహానికి ఆహ్వానం అందలేదని... అందుకే తాను నిహారిక వివాహానికి వెళ్లలేదని ప్రచారం జరిగింది. ఈ పుకార్లకు రేణూ దేశాయ్ చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. నిహారిక వివాహానికి రాకపోవడానికి గల కారణం వివరించారు. 

 
రేణూ దేశాయ్ ఇటీవల తన కమ్ బ్యాక్ ప్రకటించారు. ఆద్య పేరుతో తెరకెక్కుతున్న ఓ వెబ్ సిరీస్ లో రేణూ దేశాయ్ నటిస్తున్నారు. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈఓగా ఆమె ఈ సిరీస్ లో కనిపిస్తారని సమాచారం. కాగా ఈ సిరీస్ షూటింగ్ లో బిజీగా ఉన్న రేణూ దేశాయ్ వివాహానికి హాజరుకాలేకపోయారని చెప్పారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రేణూ దేశాయ్ ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఐతే ఈ వాదనలు ఎవరూ నమ్మడం లేదు.పిల్లలు అకీరా నందన్, ఆద్యలను పెళ్ళికి పంపిన రేణూ దేశాయ్ తాను మాత్రం పెళ్ళికి వెళ్ళలేదు. 
 
భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆచార్య, ఆర్ ఆర్ ఆర్, పుష్ప వంటి చిత్రాల షూటింగ్ పక్కనబెట్టి మెగా హీరోలు ఈ వేడుకలో పాల్గొనగా.. షూటింగ్ వలన రాలేకపోయానని రేణూ చెప్పడం కొంచెం విడ్డూరంగా ఉంది. కాగా పవన్ మూడో భార్య సైతం ఈ వివాహానికి హాజరుకాలేదు. క్రిస్మస్ నేపథ్యంలో ఆమె రష్యా వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ లో లేని అన్నా లెజెనేవా నిహారిక పెళ్ళికి హాజరు కాలేదు. దీనితో పవన్ కళ్యాణ్ తో పాటు రేణూ దేశాయ్ పిల్లలు మాత్రమే పెళ్ళికి రావడం జరిగింది. 

PREV
click me!

Recommended Stories

3 Roses 2 OTT Review: 3 రోజెస్‌ సీజన్‌ 2 రివ్యూ.. ఈషా రెబ్బా, రాశి సింగ్, కుషిత బోల్డ్ సిరీస్‌ ఎలా ఉందంటే?
అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..? బాలయ్య సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే?