‘సలార్‌’:ఆ పాత్ర కోసం మోహన్ లాల్ ని...?

By Surya Prakash  |  First Published Dec 16, 2020, 9:40 AM IST

ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాలో హీరోకు మోటి వేషన్ ఇస్తాయట. అయితే ఆ పాత్ర చిన్నగా ఉంటుంది. గతంలో అయితే కృష్ణం రాజుని తీసుకునేవారు . కానీ మారిన సినిమా లెక్కలు పాన్ ఇండియా థోరణిలో సాధ్యమైనంతమేరకు సినిమాలో పరభాషా నటులను నింపటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మళయాళ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మోహన్ లాల్ ని ప్రయత్నం చేస్తున్నారట. ఆ పాత్ర గాడ్ ఫాధర్ లాంటిదని వినికిడి.  
 


ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలను కూడా వెనక్కి నెట్టి సలార్‌ను పట్టాలెక్కిస్తున్నారు ప్రభాస్‌. ఆయనకు ఆ ప్రాజెక్టుపై అంత నమ్మకం ఉంది. వరస డేట్స్ ఇవ్వటానికి ఉత్సాహం చూపిస్తున్నారు. హీరోనే అంత ఉత్సాహం చూపిస్తే ఇంక మేకర్స్ స్పీడు ఎలా ఉండాలి. అందుకే కాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఈ నేపధ్యంలో  ఈ మూవీ కాస్టింగ్‌కు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మోహన్ లాల్ ని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయట. మొదట ఈ ప్రాజెక్టు ఫైనల్ కాకముందు మోహన్ లాల్ ని అనుకోలేదట.

 ఓ సీనియర్ ఆర్టిస్ట్ తో లాగేద్దామనుకున్నారట. అయితే ప్లాష్ బ్యాక్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు సినిమాలో హీరోకు మోటి వేషన్ ఇస్తాయట. అయితే ఆ పాత్ర చిన్నగా ఉంటుంది. గతంలో అయితే కృష్ణం రాజుని తీసుకునేవారు . కానీ మారిన సినిమా లెక్కలు పాన్ ఇండియా థోరణిలో సాధ్యమైనంతమేరకు సినిమాలో పరభాషా నటులను నింపటానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మళయాళ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని మోహన్ లాల్ ని ప్రయత్నం చేస్తున్నారట. ఆ పాత్ర గాడ్ ఫాధర్ లాంటిదని వినికిడి.  

Latest Videos

ఈ సినిమా కోసం మోహన్ లాల్ కి సలార్ మేకర్స్ భారీ పారితోషకం ఆఫర్ చేసారట. మోహన్ లాల్ కి సలార్ లో నటించేందుకు దాదాపుగా 20 కోట్ల ఆఫర్ ఇచ్చినట్టుగా  వినిపిస్తోంది. ఈ వార్త నిజమయ్యి.. సలార్ కు మోహన్ లాల్ సై అంటే.. సినిమాపై భారీ అంచనాలు పెరగడం ఖాయం.   ఇక  డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ బడ్జెట్ తో సలార్ సినిమా చెయ్యబోతున్నాడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ తో అందరిలో ఆసక్తి  రేపిన ప్రశాంత్ నీల్.. ఈ సినిమాలో ప్రభాస్ ని మాస్ గా పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నాడు. 
 

click me!