'వైల్డ్ డాగ్' అక్కడ పెద్ద హిట్, టీమ్ షాక్

Surya Prakash   | Asianet News
Published : Apr 24, 2021, 12:35 PM IST
'వైల్డ్ డాగ్' అక్కడ పెద్ద హిట్, టీమ్ షాక్

సారాంశం

అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో.. నూతన దర్శకుడు అషిషోర్ సోలోమెన్ తెరకెక్కించిన సినిమా 'వైల్డ్ డాగ్'.

కొన్ని సినిమాలు ఓటీటిల్లో మంచి వ్యూస్ సంపాదించుకుంటాయి. మరికొన్ని థియోటర్స్ లో తెగ ఆడేస్తూంటాయి. రెండు చోట్లా ఉండే ఆడియన్స్ నచ్చే సినిమాలు కొన్నే ఉంటాయి. ఇక ఓటీటిలో మాత్రమే నచ్చే సినిమా గా వైల్డ్ డాగ్ పేరు తెచ్చుకుంటోంది. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన వైల్డ్ డాగ్ చిత్రం ఆ మధ్యన థియేటర్లలో రిలీజైంది.  అయితే అక్కడ అసలు ఆడలేదు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా లేకపోతే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంది మంచి స్పందన వచ్చేది అని ఆశపడ్డారు కానీ అందులో నిజం లేదని సినిమా ఓపినింగ్స్ ని బట్టి, సినిమా ని బట్టి అర్దమైంది. ఆదే రోజు రిలీజైన సుల్తాన్ కు వచ్చిన స్పందన ఈ సినిమాకు రాలేదు. 

సెకండ్ వేవ్ కారణంగా థియేటర్లలో ఎక్కువ రోజులు నిలబడలేకపోయిన ఈ చిత్రం ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చింది. దాంతో అక్కడ చూడలేకపోయినన ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో చాలా మంది చూస్తున్నారు. నాలుగు భాషల్లో లభ్యమవుతున్న ఈ చిత్రం తెలుగు వెర్షన్, ఇండియా లెవెల్లో టాప్ లో ఉంది.

తమిళ వెర్షన్ ఐదవ స్థానంలో ఉంది. ఎన్ ఐ ఏ ఏజెంట్ గా నాగార్జున నటన ప్రేక్షకులను నచ్చుతోంది. కథా కథనాలు అన్నీ సరిగ్గా ఉండడంతో ప్రస్తుతం ఓటీటీలో చూడదగ్గ చిత్రంగా నిలుస్తోంది. సోలోమన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ప్రేక్షకులకూ బాగా నచ్చింది. సో థియోటర్ లో ఎలా ఉన్నా..ఓటీటిలో అయినా  చాలా రోజుల తర్వాత నాగార్జునకి మంచి హిట్ పడిందని చెప్పుకోవచ్చు. 

PREV
click me!

Recommended Stories

Kumbhakarna: కుంభకర్ణుడు అంత గొప్పవాడా, అయినా శ్రీరాముడు భయంకర యుద్ధం చేసి అతడిని ఎందుకు చంపాడో తెలుసా ?
Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు అదిరిపోయే షాక్.. అరెస్టు చేస్తానన్న ఎస్ఐ, వల్లి ఆనందం