రెజీనాని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. డబ్బు కోసమే ఇలాంటి పనులు అంటూ..

pratap reddy   | Asianet News
Published : Oct 21, 2021, 06:16 PM IST
రెజీనాని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. డబ్బు కోసమే ఇలాంటి పనులు అంటూ..

సారాంశం

రెజీనా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అందుకు కారణం రెజీనా ఓ మద్యం బ్రాండ్ ని ప్రమోట్ చేస్తుండటమే.

రెజీనా చివరగా తెలుగులో సూపర్ హిట్ మూవీ 'ఎవరు'లో నటించింది. అడవి శేష్ హీరోగా తెరకెక్కిన ఈ థ్రిల్లర్ మూవీలో రెజీనా నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టింది.  యువతలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ రెజీనా. పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాలతో Regina Cassandra క్రేజ్ తెచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో కమర్షియల్ చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చిన రెజీనా ప్రస్తుతం ప్రయోగాత్మక చిత్రాల్లో నటిస్తోంది. 

ఇదిలా ఉండగా సెలెబ్రిటీలు కార్పొరేట్ సంస్థల ఉత్పత్తులకు ప్రచారం కల్పించడం సాధారణమైన విషయం. అయితే సెలెబ్రిటీ హోదాలో ఉన్న వారు ఎలాంటి సంస్థలకు, ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తున్నారనేది కూడా కీలకంగా మారుతుంది. ప్రజలకు చేటు చేసే ఉత్పత్తులకు ప్రచారం కల్పిస్తే సెలెబ్రెటీలకు చిక్కులు తప్పవు. 

తాజాగా రెజీనా సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. అందుకు కారణం రెజీనా ఓ మద్యం బ్రాండ్ ని ప్రమోట్ చేస్తుండటమే. రెజీనా తన ఇంస్టాగ్రామ్ పేజీలో విస్కీని ప్రమోట్ చేస్తూ పోస్ట్ పెట్టింది. 'నా జీవితం 9 ఏళ్ల వయసు నుంచే ఫిలిమ్స్, కమర్షియల్ యాడ్స్ తో ముడిపడి ఉంది. ఈ జర్నీ నాకు నిధి లాంటిది అంటూ ఓ మద్యం బ్రాండ్ ని ప్రమోట్ చేసింది. చేతిలో విస్కీ గ్లాస్ తో కనిపించింది. 

Also Read: పరువు నష్టం దావా కేసులో సమంత స్టేట్మెంట్ ఇదిగో.. అబార్షన్, 300 కోట్ల డీల్ అంటూ..

ఈ పోస్ట్ పెట్టిన వెంటనే రెజినాపై ట్రోలింగ్ మొదలయింది. 'డిస్ లైక్ చేయండి, అన్ ఫాలో చేయండి అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.. ప్రజలకు అనారోగ్యం కలిగించే ఇలాంటి వాటికి డబ్బు కోసమే ప్రచారం కల్పిస్తున్నారు అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇలా పబ్లిక్ గా మద్యాన్ని ప్రమోట్ చేస్తారా అంటూ మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు. 

Also Read: పరువు నష్టం దావా: సమంత న్యాయవాదిపై న్యాయమూర్తి ఆగ్రహం

ఓ సెలెబ్రిటీ ఇలాంటి ప్రమోషన్స్ చేయడం తప్పకుండా వివాదభరిత అంశమే అవుతుంది. మరి రెజీనా దీనిని సమర్థించుకుంటుందా ? నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తుందేమో వేచి చూడాలి. ఇదిలా ఉండగా రెజీనా ప్రస్తుతం 'నేనే నా?' అనే చిత్రంలో నటిస్తోంది. తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ రానుంది. 

 

PREV
click me!

Recommended Stories

Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు
Nagabandham Trailer Review: అనంత పద్మనాభస్వామి ఆలయ రహస్యాలు, నాగబంధం ట్రైలర్ రివ్యూ..