థమన్ సెంచరీ బాదేశాడు!

Published : Nov 01, 2018, 07:23 PM ISTUpdated : Nov 01, 2018, 07:25 PM IST
థమన్ సెంచరీ బాదేశాడు!

సారాంశం

టాలీవుడ్ లో మ్యూజిక్ దర్శకుల మధ్య పోటీ తీవ్రత ఎక్కువవుతోంది. అసలు అవకాశం వచ్చింది అంటే కుర్ర టెక్నీషియన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు.

టాలీవుడ్ లో మ్యూజిక్ దర్శకుల మధ్య పోటీ తీవ్రత ఎక్కువవుతోంది. అసలు అవకాశం వచ్చింది అంటే కుర్ర టెక్నీషియన్స్ ఏ మాత్రం తగ్గడం లేదు. ఆ లిస్ట్ లో థమన్ ఇటీవల కాలంలో రాకెట్ లో దూసుకుపోతున్నాడు. ఇకపోతే ఫాస్ట్ గా హాఫ్ సెంచరీ కొట్టిన ఈ మ్యూజిషియన్ ఇప్పుడు సెంచరీ కూడా బాదేసినట్లు చెప్పేశాడు. 

అది కూడా అరవింద సమేత సినిమాతో ఆ రికార్డ్ అనుకోవడం విశేషం. చాలా ఆలస్యంగా థమన్ ఈ విషయాన్నీ చెప్పాడు. సోషల్ మీడియా ద్వారా ఓకే ఫొటో పోస్ట్ చేస్తూ అరవింద సమేత తన 100వ చిత్రం కావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. నిజంగా సినిమా విజయంలో థమన్ కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. 

అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లిందని చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ ప్రతి సరి చెప్పుకుంటూ వచ్చారు. కాపీ ట్యూన్స్ - రిపీట్ మ్యూజిక్ అంటూ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా థమన్ ఆ విమర్శలను పట్టించుకోకుండా సెంచరీ కొట్టాడు అంటే దర్శక నిర్మాతలకు అతని వర్క్ ఎంతగా నచ్చుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

 

 

PREV
click me!

Recommended Stories

OTT : 2025లో అత్యధికంగా చూసిన 10 వెబ్ సిరీస్‌లు, IMDb ర్యాంకింగ్స్
నా భార్య కంటే నాకు సమంతే ఎక్కువ.. డైరెక్టర్ క్రేజీ కామెంట్స్..!