
విజయ్ దేవరకొండ బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టారు. రక్తాన్ని, చెమటని చిందిస్తూ విధ్వంసానికి తెరలేపారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం `లైగర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, హిందీలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతుంది. డేరింగ్, డాషింగ్, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఛార్మితోపాటు కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. `సాలా క్రాస్ బ్రీడ్` అనేది ట్యాగ్‌లైన్.
ఈ సినిమా దాదాపు సగానికిపైగానే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా గ్యాప్ వచ్చిన ఈ చిత్ర షూటింగ్ తిరిగి బుధవారం ప్రారంభమైంది. బాక్సింగ్ రింగ్ లో అలసిపోయి కూర్చొన్న విజయ్ దేవరకొండ లుక్ ఆకట్టుకుంటుంది. ఈ మేరకు చిత్ర బృందం `బ్లడ్, స్వెట్, వైలెన్స్ బిగిన్` అని పంచుకున్నారు. బాక్సింగ్ కోర్ట్ లో రక్తం, చెమట చిందించడమే కాకుండా, విధ్వంసాన్ని సృష్టించబోతున్నారనే అర్థంతో పంచుకున్న ఈ ట్యాగ్‌లైన్ ఆకట్టుకుంటుంది.
ఇందులో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంతో ఆమె తెలుగు ఆడియెన్స్ కి పరిచయం కాబోతుంది. నిజానికి ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో వాయిదా పడింది. ఇప్పుడు రిలీజ్‌పై ఇంకా క్లారిటీ లేదు. ఈ ఏడాది చివర్లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోనూ విడుదల కానుందని సమాచారం.