బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్

Published : Sep 09, 2020, 09:20 AM ISTUpdated : Sep 09, 2020, 09:21 AM IST
బిగ్‌ అనౌన్స్‌మెంట్‌: సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో అఖిల్

సారాంశం

ప్రస్తుతం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. హీరోలను మోస్ట్ స్టైలిష్ గా చూపించే సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో నెక్ట్స్‌ సినిమా చేయనున్నాడు అఖిల్.

టాలీవుడ్ లో మరో బిగ్ అనౌన్స్‌మెంట్‌  వచ్చింది. అక్కినేని నట వారసుడు అఖిల్‌ ఓ స్టైలిష్ యాక్షన్‌ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ప్రకటన ఈ రోజు ఉదయం 9 గంటల 9 నిమిషాల 9 సెకన్లకు చేశారు చిత్రయూనిట్. అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌తో కలిసి దర్శకుడు సురేందర్‌ రెడ్డి స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఈ సినిమాకు వక్కంతం వంశీ కథ అందిస్తున్నాడు. అఖిల్‌ 5వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. ప్రస్తుతం అఖిల్ బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

పూజ హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే రిలీజ్‌ కావాల్సి ఉన్నా లాక్ డౌన్‌ కారణంగా వాయిదా పడింది. సైరా నరసింహారెడ్డి రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్‌  తీసుకున్న దర్శకుడు సురేందర్‌ రెడ్డి కొంత కాలంగా అఖిల్ సినిమా కథ విషయంలో బిజీగా ఉన్నాడు.

PREV
click me!

Recommended Stories

Dhurandhar: ధురంధర్ కోసం డైరెక్టర్ ఆదిత్య ధర్ ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసా.. స్టార్లు ఎవరూ ఒప్పుకోలేదు, కానీ
Sharwanand: 23 ఏళ్ల కుర్రాడి టాలెంట్‌కి శర్వానంద్‌ ఫిదా.. టాలీవుడ్‌పై ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌