`చిన్నారి పెళ్లికూతురు` నటికి బ్రెయిన్‌ స్ట్రోక్‌.. ఐసీయూలో చికిత్స

By Satish ReddyFirst Published Sep 9, 2020, 7:36 AM IST
Highlights

సీనియర్‌ నటి, బాలికా వదు ఫేం సురేఖ సిఖ్రిని ఆసుపత్రిలో జాయిన్‌ చేశారు. బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావటంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

ప్రముఖ సినిమా, టీవీ, రంగస్థల నటి సురేఖ సిఖ్రి తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని క్రిటీకేర్‌ ఆసుపత్రిలో చేరారు. 75 ఏళ్ల సురేఖకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చినట్టుగా వైధ్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అంధిస్తున్నామని పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బాలిక వదు సీరియల్‌తో ఆమె బాలీవుడ్‌తో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా చేరువయ్యారు.

నేషనల్ స్కూల్‌ ఆఫ్ డ్రామా డిగ్రీ పొందిన సురేఖ 1978లో నటనా రంగంలోకి అడుగుపెట్టారు. ఆమె ఉత్తమ సహాయనటిగా మూడు సార్లు జాతీయ అవార్డును కూడా అందుకున్నారు. తామస్, మామ్మో, బదాయిహో సినిమాల్లోని పాత్రలకుగాను ఆమెను జాతీయ అవార్డు వరించింది. నాటక రంగానికి ఆమెచేస్తున్న సేవలకు గాను 1989లో సంగీత్‌ నాటక్‌ అకాడమీ అవార్డ్‌ను ఆమెకు ప్రధానం చేశారు.

2018లో మహాబలేశ్వర్‌లో ఓ టీవీ సీరియల్‌ కోసం షూటింగ్ చేస్తుండగా ఆమెకు స్ట్రోక్ వచ్చింది. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్ధితే ఏర్పడటంతో కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఆమె నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమైన ఘోస్ట్‌ స్టోరీస్‌లో కీలక పాత్రలో నటించింది.

click me!