క్యాన్సర్‌తో పోరాడుతూనే సినిమా షూటింగ్.. సంజయ్‌ దత్‌పై ప్రశంసలు

Published : Sep 09, 2020, 08:36 AM IST
క్యాన్సర్‌తో  పోరాడుతూనే సినిమా షూటింగ్.. సంజయ్‌ దత్‌పై ప్రశంసలు

సారాంశం

ఇప్పటికే మొదటి సెషన్‌ కీమో థెరపి పూర్తి చేయించుకున్న సంజయ్‌ దత్‌ తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. మంగళవారం షంషేర్ సినిమా షూటింగ్‌కు వెళుతూ మీడియా కెమెరాలకు హాయ్‌ చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన చాలా యాక్టివ్‌గా కనిపించటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.

ఇటీవల బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌కు లంగ్‌ క్యాన్సర్‌ అని తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లి చికిత్స తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. అప్పటి వరకు సంజు బాబా సినిమా షూటింగ్‌లు కూడా చేయకపోవచ్చుననే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అయితే సంజయ్ మాత్రం విదేశాలకు వెళ్లకుండా ఇండియాలో ఉండి చికిత్స పొందుతున్నారు. అంతేకాదు షూటింగ్‌లకు కూడా హాజరవుతున్నాడు.

ఇప్పటికే మొదటి సెషన్‌ కీమో థెరపి పూర్తి చేయించుకున్న సంజయ్‌ దత్‌ తాజాగా ఓ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. మంగళవారం షంషేర్ సినిమా షూటింగ్‌కు వెళుతూ మీడియా కెమెరాలకు హాయ్‌ చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన చాలా యాక్టివ్‌గా కనిపించటంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. సంజయ్‌ ఆరోగ్యం బాగుందని ప్రస్తుతం సెట్స్‌ మీద ఉన్న అన్ని సినిమాలను ఆయన పూర్తి చేస్తారన్న టాక్ వినిపిస్తోంది.

షంషేర్ షూటింగ్‌లో ఆయన రెండు రోజుల పాటు పాల్గొనున్నారు. ఆ తరువాత తిరిగి ట్రీట్‌మెంట్‌కు వెళ్లనున్నారు. అయితే ట్రీట్‌మెంట్‌ చేయించుకుంటూనే మిగతా సినిమాలను కూడా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట సంజయ్‌ దత్‌. తాను ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా నిర్మాతల క్షేమం కోసం సినిమా షూటింగ్‌లకు హాజరవుతున్న సంజయ్‌ దత్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

PREV
click me!

Recommended Stories

ప్రభాస్ జోకర్ గెటప్ వెనుకున్న వ్యక్తి ఎవరంటే.? మనసులోని మాట చెప్పిన డైరెక్టర్ మారుతీ
Poonam Kaur: ఆ స్టార్‌ హీరోని తన భార్యాపిల్లల వద్దకు వెళ్లకుండా చేశాడు.. డైరెక్టర్‌ దారుణాలు బయటపెట్టిన పూనమ్‌ కౌర్‌