నాగచైతన్య - శోభిత ధూళిపాళ డేటింగ్ పై అఖిల్ కి ప్రశ్న.. అక్కినేని హీరో ఆన్సర్ ఏంటంటే?

By Asianet News  |  First Published Apr 16, 2023, 2:51 PM IST

అక్కినేని యంగ్ హీరో అఖిల్ (Akhil) ప్రస్తుతం తన 'ఏజెంట్' ఫిలిం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా అఖిల్ కి నాగచైతన్య- శోభిత డేటింగ్ రూమర్స్ పై ప్రశ్న ఎదురైంది. 
 


యంగ్ హీరో అక్కినేని అఖిల్ చివరిగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంతో అలరించారు. ఈ మూవీ డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి తో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా Agent లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నెలలోనే రిలీజ్ కానుండడంతో అఖిల్ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అఖిల్ కి ఓ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఎదురైంది.

గత కొద్ది కాలంగా అక్కినేని హీరో నాగచైతన్య - శోభిత ధూళిపాళ డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొన్నటి వరకు చైతు శోభిత లండన్ లో చక్కర్లు కొడుతున్నట్టు హోటల్లో డిన్నర్ చేసినట్లు ఫోటో బాగా వైరల్ అయింది. దీనిపై రీసెంట్ గా శోభిత కూడా స్పందించారు. అది నేను కాదు అంటూ బదులిచ్చారు. తాజాగా వీరి డేటింగ్ రూమర్లపై అఖిల్ అక్కినేని కి ప్రశ్న ఎదురయింది. దీంతో ఇంట్రెస్టింగా బదులిచ్చారు.

Latest Videos

''మీ అన్న నాగచైతన్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. ఎవరు అమ్మాయితో ఫోటోలు కనిపించి ఆ టాపిక్ గా మారారు. మరి మీ పరిస్థితి ఏంటి'' అంటూ ఇంటర్వ్యూయర్ ప్రశ్నించాడు. దీనిపై అఖిల్ స్పందిస్తూ.. కేవలం తన వరకే బదులిచ్చారు. అన్న చైతన్య పై వస్తున్న రూమర్లపై కామెంట్ చేయలేదు.... చైతు మాట్లాడుతూ.. 'నా పరిస్థితి ఏజెంట్ మూవీ. రెండేళ్లుగా జుట్టు, బాడీ మెయింటైన్ చేయడం సరిపోయింది. ప్రస్తుతం ఫోకస్ అంతా సినిమాలపైనే..' అంటూ బదులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

ఇదిలా ఉంటే.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఏజెంట్ చిత్రం ఏప్రిల్ 28న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలకపాత్ర వహిస్తున్నారు. సాక్షి వైద్య కథానాయక. హిప్ హప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 18న పవర్ ఫుల్ ట్రైలర్ రాబోతుంది.

click me!