అంచనాలను రీచ్ అవుతున్న అఖిల్ ‘ఏజెంట్’.. టీజర్ కు మాసీవ్ రెస్పాన్స్..

Published : Jul 16, 2022, 11:19 AM ISTUpdated : Jul 16, 2022, 11:26 AM IST
అంచనాలను రీచ్ అవుతున్న అఖిల్ ‘ఏజెంట్’.. టీజర్ కు మాసీవ్ రెస్పాన్స్..

సారాంశం

అఖిల్ అక్కినేని నటించిన తాజా చిత్రం ‘ఏజెంట్’. ఈ చిత్రంపై అక్కినేని అభిమానులు భారీ హైప్ పెటుకున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్ గా వచ్చిన టీజర్ అంచనాలను రీచ్ అవుతోంది. 24 గంటలు గడవక ముందే మాసీవ్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.   

వరుస పరాజయాలతో నడుస్తున్న అక్కినేని అఖిల్ (Akhil) కేరీర్ ఇటీవల రిలీజ్ అయిన ‘మోస్ట్ బ్యాచిలర్’ మూవీతో ఊపందుకుంది. ఈ రొమాంటిక్ ఫిల్మ్ తో సూపర్ సక్సెస్ ను అందుకున్నాడు అఖిల్. అదే జోష్ తో వెంటనే దర్శకుడు సురేందర్ రెడ్డితో చేతులు కలిపాడు. మరో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకునేందుకు స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘ఏజెంట్’తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా అదిరిపోయే అప్డేట్స్ అందిస్తూ అభిమానుల అంచనాలను రీచ్  అవుుతున్నారు. 

అయితే, అఖిల్ Agent నుంచి టీజర్ అనౌన్స్ మెంట్ రాగానే అక్కినేని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. నిన్న విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అభిమానుల అంచనాలను రీచ్ అవడంతో ఖుషీ అవుతున్నారు. టీజర్ విడుదల అయినందుకే ఫ్యాన్స్ కొందురు పటాసులు పేల్చి సంబురాలు చేసుకున్నారంటే..  ఈ సినిమాపై అభిమానులు  ఎంతటి అంచనాలు పెట్టుకున్నారో అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. Agent Teaser విడుదలై 24 గంటలు కాకముందే మాసీవ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

యూట్యూబ్ లోకి వచ్చిన గంటలోనే లక్షల్లో వ్యూస్ ను సాధించింది. కేవలం 18 గంటల్లోనే 74 లక్షల వ్యూస్ ను దక్కించుకుంది. దాదాపు 4 లక్షలకు పైగా లైక్స ను దక్కించుకుంది. ఇంకా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతూనే ఉంది.  మంచి వ్యూస్ తో దూసుకుపోతోంది. సిక్స్ ప్యాక్ తో  అఖిల్ అదరగొట్టాడు. మరోవైపు మలయాళ స్టార్ మమ్మూట్టీ  (Mammootty) కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అఖిల్ మూవీలో యాక్షన్ రైడ్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తాడనేందుకు ఈ టీజర్ ప్రామీసింగ్ గా కనిపిస్తోంది. 

అక్కినేని అఖిల్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషనల్ వస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12న   ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడలోనూ రిలీజ్ కాబోతోంది. అన్ని భాషల్లోని టీజర్ కు మాసీవ్ రెస్సాన్స్ వస్తుండటం విశేషం. ద్వితీయ శ్రేణి హీరోస్ లలో ఇంతటి రెస్పాన్స్ రావడం సెన్సేషన్ గానే చెప్పాలి. హీరోయిన్ గా సాక్షి వైద్య (Sakshi Vaidya) నటిస్తోంది. ఏకే ఎంట‌ర్టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి సురేంద‌ర్ రెడ్డి దర్వకత్వం వహిస్తున్నారు. హిప్ హాప్ తమిజా సంగీతం అందించారు. 

 

PREV
click me!

Recommended Stories

ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు.. 2026లో బాక్సాఫీస్ ను షేక్ చేయబోతున్న స్టార్ హీరోల సినిమాలు
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?