Gargi OTT: 'గార్గి' ఓటీటీ రిలీజ్.. వివరాలు!

Published : Jul 16, 2022, 10:28 AM IST
 Gargi OTT: 'గార్గి' ఓటీటీ రిలీజ్.. వివరాలు!

సారాంశం

గార్గి ఒక సందేశాత్మక చిత్రం. తప్పు చేస్తే తన మన భేదం లేకుండా న్యాయానికి సపోర్ట్ చేయాలనే కాన్సెప్ట్ మీద రూపొందించారు. ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కోసం కాకుండా ఒక మంచి సినిమా చూడాలనుకుంటే కచ్చితంగా ఈ సినిమా చూడాలి. 

 తెలుగులో లేడీ పవర్ స్టార్ అని పిలిపించుకుంటున్న సాయి పల్లవి రీసెంట్ గా విరాటపర్వం సినిమాతో పలకరించింది. ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు   మరోసారి గార్గి అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మలయాళ భాషలో రూపొందిన ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో కూడా డబ్బింగ్ చేసి ఏకకాలంలో విడుదల చేశారు. జూలై 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గార్గి సినిమా భారీ ఎత్తున విడుదలైంది. ముందు నుంచి సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా సినిమా ట్రైలర్ విడుదల చేశాక సినిమా మీద ఆసక్తి పెరిగింది. 

అలాగే రిలీజ్ కు ముందు రోజు సినిమాకు ప్రివ్యూలు వేసారు. వాటితో మీడియా ద్వారా కొంత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు. మీడియాలో రివ్యూలు కూడా పాజిటివ్ గానే వచ్చాయి. అయితే ఓపినింగ్స్ మాత్రం దక్కలేదు. కోర్ట్ రూమ్ డ్రామాని థియోటర్ లో చూడటానికి జనం ఉత్సాహం చూపించలేదు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ ఎప్పుడనేది హాట్ టాపిక్ గా మారింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా ఓటీటీ హక్కులను సోనీ లీవ్ సొంతం చేసుకుంది. ఇక థియేటర్లో విడుదలైన నాలుగు వారాల అనంతరం ఓటీటీ వచ్చే అవకాశం ఉంది.   ఈ సినిమా కాస్త ముందుగా వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటోంది ట్రేడ్.  ఇక విరాటపర్వం సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినాప్పటికీ ఓటీటీ లో మాత్రం ఆ సినిమాకు మంచి గుర్తింపు లభించింది.    తెలుగులోనే కాకుండా తమిళ్ మలయాళం లో కూడా ఈ సినిమాను విడుదల చేశారు. తెలుగులో రానా తమిళంలో సూర్య ద్వారా ట్రైలర్స్ లాంచ్ చేయించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?
Top 10 Heroes: హవా చూపించిన మహేష్‌, పవన్‌.. ఇండియా టాప్‌ 10 హీరోలు వీరే.. నెం 1 ఎవరంటే?