
ZEE5 Global, దక్షిణాసియా కంటెంట్ కోసం ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాట్‌ఫారమ్ అయిన ZEE5 గ్లోబల్, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ మరియు ఇతర భాషల్లో వివిధ ఫార్మాట్‌లలో అనేక రకాల కంటెంట్‌ను నిర్విరామంగా విడుదల చేస్తోంది. ZEE5 గ్లోబల్ దాని ప్రారంభం నుండి ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది. స్ట్రీమింగ్ దిగ్గజం ఇటీవల RRR ('రౌద్రం రణమ్ రుధిరం') ను బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ప్రసారం చేసింది.
మా నీళ్ల ట్యాంక్ ట్రైలర్ లాంచ్ చేసిన పూజా హెగ్డే
సుశాంత్-ప్రియా ఆనంద్ హీరోయిన్స్ గా నటించిన మా నీళ్ల ట్యాంక్ వరల్డ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్దమవుతుంది. జులై 15 నుండి ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫార్మ్ జీ 5లో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో మా నీళ్ల ట్యాంక్ ట్రైలర్ విడుదల చేశారు.
స్టార్ లేడీ పూజా హెగ్డే చేతుల మీదుగా మా నీళ్ల ట్యాంక్ సిరీస్ ట్రైలర్ లాంచ్ చేశారు. మా నీళ్ల ట్యాంక్ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉంది. హీరో సుశాంత్ పోలీస్ రోల్ చేస్తుండగా, కమెడియన్ సుదర్శన్ కీలక రోల్ చేస్తున్నారు. తాను ప్రేమించిన అమ్మాయి సురేఖ(ప్రియా ఆనంద్) తన ప్రపోజల్ ఒప్పుకోవాలని లేదంటే నీళ్ల ట్యాంక్ పై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంటానని ఊరి వారిని బెదిరించడం ట్రైలర్ లో చూడవచ్చు. సుశాంత్ ని ప్రేమించే అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తుండగా... సినిమాలో వీరి ప్రేమ కథ కీలకం అని తెలుస్తుంది. ఆద్యంతం ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. సిరీస్ పై అంచనాలు పెంచేసింది.
ట్రైలర్ లింక్ - ఇక్కడ చూడండి: https://youtu.be/MEUDLh4gaVg
మా నీళ్ల ట్యాంక్ విడుదల నేపథ్యంలో జీ 5 గ్లోబల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ అర్చన ఆనంద్ మాట్లాడారు. ''జీ5 ఒరిజినల్ మా నీళ్ల ట్యాంక్ విడుదల సందర్భంగా మేము ఆనందం వ్యక్తం చేస్తున్నాము. గొప్ప దర్శకులతో మీకు అద్భుతమైన కంటెంట్ అందిస్తామన్న మాట నిలబెట్టుకుంటున్నాము. మా నీళ్ల ట్యాంక్ సిరీస్ మా వ్యూవర్స్ కి గొప్ప అనుభూతి పంచుతుందనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నాము. వివిధ భాషల్లో గొప్ప కంటెంట్ అందించడానికి కట్టుబడి ఉన్నాము...'' అన్నారు. 8 ఎపిసోడ్స్ గా మా నీళ్ల ట్యాంక్ సిరీస్ ప్రసారం కానుంది. కామెడీ అండ్ ఎమోషనల్ అంశాలతో కూడిన విలేజ్ డ్రామాగా డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య తెరకెక్కించారు.
తారాగణం:
వంశీగా సుశాంత్
సురేఖగా ప్రియా ఆనంద్
గోపాల్ గా సుదర్శన్
కోదండంగా ప్రేమ్ సాగర్
చాముండిగా నిరోషా
నరసింహంగా రామరాజు
రమ్యగా దివి
బూనెమ్మగా అన్నపూర్ణమ్మ
రమణగా అప్పాజీ అంబరీష
భార్గవిగా బిందు చంద్రమౌళి
సుబ్బుగా సందీప్ వారణాసి
రేవతిగా లావణ్య రెడ్డి
వినియోగదారులు Roku, Apple TVలు, Android TV, Amazon Fire Stick, Google Play Store / iOS యాప్ స్టోర్ నుండి ZEE5 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ZEE5 కూడా పై వాటిలో అందుబాటులో ఉంది ZEE5
జీ 5 గురించి..
జీ ఎంటర్టైన్మెంట్స్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(ZEEL) చే స్థాపించినబడిన జీ5 గ్లోబల్ లీడింగ్ ఎంటర్టైన్మెంట్ డెస్టినేషన్ గా ఉంది. 2018లో స్థాపించబడిన జీ5 ప్రపంచవ్యాప్తంగా 190కి పైగా దేశాల్లో 18 భాషల్లో కంటెంట్ అందిస్తుంది. జీ 5గ్లోబల్ హిందీ, తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, తమిళ్, మరాఠీ, మలయాళ, ఒరియా, భోజపురి, పంజాబ్' ఉర్దూ, బెంగాలీ, గుజరాతితో పాటు ఆరు అంతర్జాతీయ భాషల్లో కంటెంట్ అందుబాటులోకి తెచ్చింది. 170000 గంటలకు పైగా కంటెంట్ డిమాండ్ వ్యూవర్స్ నుండి కలిగి ఉంది. ఒరిజినల్స్, మూవీస్, సిరీస్లు, టీవీ షోస్, మ్యూజిక్, హెల్త్, లైఫ్ స్టైల్ వంటి భిన్నమైన కంటెంట్ జీ5 గ్లోబల్ ప్రొవైడ్ చేస్తుంది. అలాగే 15 నావిగేషనల్ లాంగ్వేజెస్, కంటెంట్ డౌన్ లోడ్, సీమ్ లెస్ వీడియో ప్లే బ్యాక్ తో పాటు వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ కలిగి ఉంది. ఆర్ ఆర్ ఆర్ వంటి ఇండియన్ బాక్సాఫీస్ హిట్స్ తో పాటు కామెడీ ఎంటర్టైనర్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, లూజర్ 2, బీబీసీ స్టూడియోస్ నిర్మించిన గాలివాన స్ట్రీమ్ అవుతున్నాయి. తాజాగా ఈ లిస్ట్ లో మా నీళ్ల ట్యాంక్ సిరీస్ వచ్చి చేరింది.
ZEE5 గ్లోబల్ ట్విట్టర్ : https://twitter.com/ZEE5Global
ZEE5 గ్లోబల్ లింక్డ్ ఇన్ : https://www.linkedin.com/company/zee5global/