
మంచు ఫ్యామిలీలో గత మూడు రోజులుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసింద. మోహన్‌బాబుకి, చిన్న కొడుకు, హీరో మంచు మనోజ్‌కి మధ్య వివాదం నడుస్తుంది. యూనివర్సిటీపై మనోజ్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తన ఇంటి నుంచి వెళ్లిపోవాలని తండ్రి మోహన్‌బాబు బెదిరిస్తున్నాడని తెలుస్తుంది. ఈ విషయంలోనే వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తుంది. అయితే గొడవలు కాస్త బయటకు వచ్చాయి. పోలీసు స్టేషన్ వరకు వెళ్లాయి. ఒకరిపై ఒకరుఫిర్యాదు చేసుకున్నారు. ప్రాణహని ఉందంటూ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం మోహన్‌బాబు.. మనోజ్‌ని ఇంట్లోకి రానివ్వకపోవడంతో ఇంటి గేట్ ని పగలగొట్టి లోపలికి వెళ్లాడు మనోజ్.
ఇది చూసిన మోహన్‌బాబు బయటకు వచ్చి ఫైర్ అయ్యాడు. వివరణ అడిగిన మీడియాప్రతినిధిపై దాడి చేశాడు. ఆ రిపోర్టర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో మీడియా నుంచి తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతుంది. మరోవైపు తలకు బలమైన గాయం అయ్యిందని మోహన్‌బాబు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. మంచు వివాదం మరింత ముదురుతుంది. సీరియస్‌గా మారింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబు పెద్ద కొడుకు, హీరో మంచు విష్ణు రంగంలోకి దిగాడు. పరిస్థితిని సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన మీడియా ముందుకు వచ్చాడు. మీడియాపై తండ్రి చేసిన దాడికి మంచు విష్ణు వివరణ ఇచ్చాడు.
ఈ సంఘటన జరిగి ఉండ కూడదు అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదన్నారు. మీడియాపై దాడిని వివరిస్తూ, ఇంటి గేట్‌ని పగలగొట్టి కొందరు లోపలికి వచ్చారు. వారిలో మీడియా వాళ్లు కూడా ఉన్నారు. ఎవరెవరో అర్థం కాలేదు. అయినా నాన్న మీడియాకి నమస్కారం పెడుతూనే బయటకు వచ్చారు. ఈ క్రమంలో ఒకరు మైక్‌ని ముఖం మీద పెట్టడంతో ఆయనకు కోపం వచ్చింది. అప్పటికే గేట్ పగలగొట్టారనే కోపంలో ఉన్నారు. ఆ సమయంలోనే ఇది జరగడంతో ఆయన ఆ కోపంలో దాడి చేయాల్సి వచ్చింది, అంతేకానీ ఉద్దేశ్యపూర్వకంగా చేసింది కాదు అని తెలిపారు మంచు విష్ణు. మీడియా పర్సన్ ఫ్యామిలీతో టచ్‌లోనే ఉన్నాను. వారిని చూసుకుంటున్నాం అన్నారు.
విష్ణు మాట్లాడుతూ, `మూడు తరాలుగా నాన్నగారు ఏంటి అనేది మీకు తెలుసు. ప్రతి ఇంట్లోనూ ఇష్యూస్ ఉంటాయి. వాటిని సెట్ చేసుకోవాలని పెద్దలు కోరుకుంటారు. మా నాన్న చేసిన తప్పు మమల్ని విపరీతంగా ప్రేమించటం. మీడియా వారు. మీకు కుటుంబాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇష్యూస్ ఉంటాయి. కానీ కొందరు మా విషయంలో లిమిట్స్ క్రాస్ చేశారు. మా అమ్మ బాధలో ఉంది. నాన్నకు దెబ్బలు జరిగాయి. నేను లాస్ ఎంజెల్స్ లో `కన్నప్ప` వర్క్ లో ఉండగా ఈ గొడవ గురించి తెలిసి . దీంతో వెంటనే అన్నీ వదిలి వచ్చాను. మీ తల్లి మీకు ఫోన్ చేసి ఎడుస్తుంటే దాన్ని మించిన బాధ ఇంకేమి ఉండదు. అమెరికా నుంచి ఇక్కడికి వచ్చే క్రమంలో నరకం చూశాను. పోలీసులు మా కంటే ముందు మీడియాకు నోటీసులు లీక్ అవుతున్నాయి. గన్స్ సరెండర్ చేయాలని మాకు నోటీసులు ఈ రోజు 9:30కి వచ్చాయి. దీనిపై నేను పోలీసులతో మాట్లాడతాను. మాకు ఏం ప్రొటెక్షన్ ఇచ్చారు. నాకు కలవాల్సిన అవసరం లేదు. కానీ వారిపై గౌరవించి కలుస్తాను అన్నారు.
మంచు మనోజ్ గురించి చెబుతూ, ఫ్యామిలీ ఇష్యూ గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు విష్ణు. ఫ్యామిలీ మ్యాటర్స్ పర్సనల్ అని, వాటి గురించి తాను మాట్లాడబోనని తెలిపారు. తమ్ముడికి తాను చెప్పాల్సిన విధంగా చెప్పానని అన్నాడు. అయితే ప్రేమలో గెలవాల్సిన విషయాలపై రచ్చ పెట్టుకుంటే ఏది జరగదు. మనోజ్ ఆరోపణలపై నేను చెప్పెది ఏమి లేదు. కడుపు చించుకుంటే పేగులు కాళ్లమీద పడతాయి. నేను ఇక్కడ ఉంటే ఫిర్యాదుల వరకు వెళ్లేది కాదు. తమ్ముడు పెళ్లి చేసుకోవడం శుభకార్యం. బిడ్డ ను కన్నారు. దాని గురించి ఎవరు ఫీలవరు. నాన్న గారి ఆస్తి ఆయన ఇష్టం. ఎంతో కష్టపడి స్వయం కృషితో గొప్ప స్దాయికి ఎదిగారు. మాకిచ్చే లభించే గౌరవం ఏదైనా ఉందంటే అది ఆయనవల్లే. కుటుంబం పరంగా నాన్న ఏది అనుకుంటే అదే ఉండాలి. తల్లిదండ్రులు రెస్పెక్ట్ ను చేయాలి.
మీడియా లో కొంతమంది హద్దు మీరుతున్నారు. అందరూ కాదు. పబ్లిక్ ఫిగర్స్ పై రిపోర్ట్ చేయటం మీడియా బాధ్యత. కానీ సోసైటీలో కొందరు ఎందుకు ఓవరాక్షన్ చేస్తున్నారు. వినయ్ గారు నాకు అన్న లాంటి వారు. ఆయన ఎవరిపైనా చేయి చేసుకోలా. వినయ్ కు నాకు 15 ఏళ్ల పరిచయం ఉంది. ఇండియాలోనే గొప్ప స్దాయి ఉన్న వ్యక్తి. నిన్న రాత్రి జరిగిన సంఘటన పై లోపల తండ్రి స్దాయి వ్యక్తి ఉంటే తలుపులు బద్దలు కొడతారా. తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటి పెరెన్నిక గలది. ఇండియాకు ఫారిన్ యూనివర్సిటీ లను తీసుకువచ్చే ఘనత మాదే అవుతుంది. మోహన్ బాబుని నమ్మి అక్కడ తమ పిల్లలను జాయిన్ చేస్తున్నారు. అది మాకు దేవాలయం. అక్కడ చెడు జరగడానికి వీల్లేదు, దాన్ని తప్పుపట్టడం బాధాకరం. మా అక్కకు, నాకు భేదాభిప్రాయాలు ఉన్నా, కొట్టినా తిట్టినా నేను పడతాను. తను నా అక్క.
మా కుటుంబంలో బయటి వ్యక్తులు ఇన్ వాల్వ్ మెంట్ ఉంటే వారికి ఈవెనింగ్ దాకా సమయం ఇస్తున్నాము. లేదంటే అందరి పేర్లు నేనే బయడపెడతాను. మా నాన్న చెప్పిందే వేద వాక్కు. ఆయన చెప్పింది నేను చెస్తాను. కానీ నా తమ్ముడిపై నేనిప్పుడు దాడులు చేయను. నా సినిమా , `మా` అసోసియేషన్ గురించి తప్ప నేను ఏ విషయంలో మాట్లాడను. కానీ నాకు కనుక అవకాశం ఉంటే ఫిర్యాదులు , వాయిస్ మెసెజ్ కూడా బయటికి వచ్చేది కాదు.. మయమే అన్ని ప్రాబ్లంస్ ను సమాధానం ఇస్తుంది` అని తెలిపారు మంచు విష్ణు. ఇదిలా ఉంటే వినయ్ రెడ్డి, అన్న మంచు విష్ణునే గొడవలకు కారణమని, సాయంత్రం ఐదుగంటలకు అన్ని వివరాలు బయటపెడతా అని మనోజ్ మరో ప్రెస్ మీట్‌లో చెప్పడం విశేషం.