శ్రీదేవికి అజిత్ ఇచ్చిన మాట.. మరి నిలబెట్టుకున్నాడా..?

Published : Aug 17, 2018, 03:22 PM ISTUpdated : Sep 09, 2018, 01:36 PM IST
శ్రీదేవికి అజిత్ ఇచ్చిన మాట.. మరి నిలబెట్టుకున్నాడా..?

సారాంశం

'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాలో నిర్మాతలను రిక్వెస్ట్ చేసి మరీ అతిథి పాత్రలో నటించాడు. ఆ సినిమా సమయంలో శ్రీదేవి.. తమిళంలో మీతో ఓ సినిమా నిర్మించాలనుందని అజిత్ ని అడిగిందట. దీనికి ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది

తమిళ స్టార్ హీరో అజిత్ కి ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంత పెద్ద స్టార్ అయినా.. సింపుల్ గా ఉంటూ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అజిత్ కి కూడా అభిమాన నటి ఒకరు ఉన్నారు. ఆమె దివంగత శ్రీదేవి. అజిత్ కి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. అందుకే రీఎంట్రీలో ఆమె నటించిన 'ఇంగ్లీష్ వింగ్లీష్' సినిమాలో నిర్మాతలను రిక్వెస్ట్ చేసి మరీ అతిథి పాత్రలో నటించాడు.

ఆ సినిమా సమయంలో శ్రీదేవి.. తమిళంలో మీతో ఓ సినిమా నిర్మించాలనుందని అజిత్ ని అడిగిందట. దీనికి ఆయన కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని బోణీకపూర్ కి కూడా చెప్పారు. అయితే ఆ తరువాత మాత్రం సినిమా ప్రస్తావన రాకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు. ఆ విషయాన్ని గుర్తుచేస్తూ వచ్చే ఏడాదిలో బోణీ కపూర్ నిర్మాణ సారధ్యంలో ఓ సినిమా చేయాలని రెడీ అయిపోయారు అజిత్.

డేట్స్ కూడా ఇచ్చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను 'ఖాకీ' చిత్రం దర్శకుడు వినోద్ డైరెక్ట్ చేయనున్నారు. మొత్తానికి అజిత్.. శ్రీదేవికి ఇచ్చిన మాటను తీర్చబోతున్నాడన్నమాట!
 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collection: ధురంధర్‌ మూవీ ఫస్ట్‌ డే కలెక్షన్లు.. రణ్‌వీర్‌ సింగ్‌ సునామీకి బాక్సాఫీస్ షేక్
Pawan kalyan ఉదయ్ కిరణ్ కాంబినేషన్ లో మిస్సైన మల్టీ స్టారర్ మూవీ ఏదో తెలుసా?