ఇంకో తెలుగు సినిమాలో అజిత్ ?

Published : Jul 18, 2024, 08:02 AM IST
 ఇంకో తెలుగు సినిమాలో  అజిత్ ?

సారాంశం

అజిత్ హీరోగా మైత్రి మూవీస్ వారు ఇప్పటికే  ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు.  ఇప్పుడు మరో సినిమాకు అజిత్ ని అడుగుతున్నారు


  తమిళ సూపర్ స్టార్ అజిత్  కు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. అందుకే  పుష్ప మేకర్స్ మైత్రీ మూవీ మేకర్స్ వారు అజిత్ తో  సినిమా అనౌన్స్ చేసారు. ఈ చిత్రం పేరు గుడ్ బ్యాడ్ అగ్లీ కాగా.. ఈ ఏడాది జూన్ నుంచి  షూటింగ్ ప్రారంభం అయ్యింది. అలాగే సంక్రాంతి రిలీజ్ కు పెట్టి పోటీకు దిగుతున్నారు. తమిళ స్టార్ హీరో అజిత్ ని తెలుగులో లాంచ్ చేస్తూ మైత్రీ వంటి పెద్ద బ్యానర్ సినిమా చేయటం ఎవరూ ఊహించలేదు. అయితే అజిత్ ఇలా ఓ తెలుగు,తమిళ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, అదీ ఓ తెలుగు నిర్మాతకు డేట్స్ ఇవ్వటం వెనక కారణం ఏమిటనేది హాట్ టాపిక్ గా చెన్నై వర్గాల్లో మారింది.  అలాగే ఇప్పుడు అజిత్ మరో తెలుగు సినిమాలో కూడా కనిపించే అవకాసం ఉందని తెలుస్తోంది.

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు అజిత్ ని #JaiHanuMan లో కీ పాత్రకు అడగటానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినికిడి.   తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) తెరకెక్కించిన సూపర్‌ హీరో చిత్రం ‘హనుమాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీనికి సీక్వెల్ గా ‘జై హనుమాన్‌’ (Jai Hanuman) రానుందని చిత్ర టీమ్  ఇప్పటికే ప్రకటించింది. దీంతో సీక్వెల్‌ అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్రలో స్టార్ హీరోని తీసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. చాలా మంది స్టార్ హీరోల పేర్లు వినిపించాయి. 

అయితే మైత్రీలో అజిత్ ఆల్రెడీ చేస్తూండటం, హనుమాన్ చిత్రాన్ని మైత్రీ వారే నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేయటంతో...అజిత్ ని ఆ పాత్రకు అడిగితే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చిందిట. మైత్రీ వారి ద్వారా అయితే అజిత్ ఒప్పుకునే అవకాసం ఉందంటున్నారు. అప్పుడు తమిళ మార్కెట్ కూడా ‘జై హనుమాన్‌’కు యాడ్ అవుతుంది.  అయితే ఆంజనేయ స్వామి పాత్రే అంటున్నారు.

‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్‌’ రూపుదిద్దుకోనుంది. 2025లో విడుదల కానుంది. జనవరి నెలలోనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. త్వరలోనే షూట్‌ ప్రారంభించనున్నారు. ‘‘హను-మాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు ’’ అని ప్రశాంత్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
 
ఇక అజిత్ హీరోగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించే  సినిమాకి ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసి పోస్టర్ రిలీజ్ చేసారు.   2025 పండక్కి విడుదల చేయాలని ప్రస్తుతానికి వారిదగ్గర ఉన్న ప్లాన్. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా సంగీత దర్శకుడిగా పని చేస్తారు. ఈ దర్శకుడు  ఇంతకు ముందు డైరక్ట్ చేసిన  విశాల్, ఎస్ జె సూర్యలతో  చిత్రం తెలుగులో బాగా ఆడటంతో అతన్ని దర్శకుడుగా ఎంచుకున్నారు.   

ఈ చిత్రం దర్శకుడు కూడా కాస్త డిఫరెంట్ గా ముందుకు వెళ్లే వాడే.  విశాల్ ఎస్జే సూర్య కాంబినేషన్లో ‘మార్క్ అంటోనీ’ అనే వెరైటీ సినిమా తీశాడు అధిక్ రవిచంద్రన్. ఇప్పుడు అజిత్ తో చేయబోయే సినిమా కూడా కాస్త డిఫరెంట్ సెటప్ లో వుంటుదని తెలుస్తోంది. మొత్తానికి పండగ సినిమాల జాబితాలో అజిత్, మైత్రీ మూవీ మేకర్స్ సినిమా కూడా చేరిపోయింది.
    

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 లో ముద్దుల గోల , డార్క్ రూమ్ లో వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు
Chiranjeevi: సౌందర్య సినిమా చూసి చేతులు కాల్చుకున్న చిరంజీవి, ఇదెక్కడి గొడవరా అని తలపట్టుకున్న డైరెక్టర్