తమిళ్ లో 100కోట్లు.. ఇక్కడ 2 కోట్లే?

Published : Feb 27, 2019, 07:30 PM IST
తమిళ్ లో 100కోట్లు.. ఇక్కడ 2 కోట్లే?

సారాంశం

కోలీవుడ్ స్టార్ హీరోలకు తెలుగులో ఎలాంటి మార్కెట్ ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మెయిన్ గా రజినీకాంత్ సినిమాలు ఇక్కడ స్టార్ హీరోల రేంజ్ లో రిలీజవుతుంటాయి. కోలీవుడ్ లో రజినీకాంత్ తరువాత ఆ స్థాయిలో 100 కోట్ల మార్కెట్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకడు. అయితే ఈ హీరోకు తెలుగులో అంతగా క్రేజ్ లేదు. 

ప్రస్తుతం విశ్వాసం సినిమాను రిలీజ్ చేయడానికి బయ్యర్లు సిద్దమవుతున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో వచ్చిన ఈ సినిమా ఇటీవల 2 కోట్ల 50 లక్షల ప్రీ రిలీజ్ తో రిలీజ్ అవుతున్నట్లు సమాచారం. తమిళ్ లో జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజయిన ఈ సినిమా 90 కోట్ల ప్రీ రిలీజ్ తో 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. 

అయితే అలాంటి హీరో సినిమా తెలుగులో మాత్రం కనీసం 3 కోట్ల బిజినెస్ చేయడం అనేది సందేహమే. ఈ శుక్రవారం సినిమాను భారీగానే రిలీజ్ చేస్తున్నారు కానీ సినిమా అసలు బయ్యర్స్ కి లాభాలు అందిస్తుందా లేదా అనేది డౌట్ గానే ఉంది. అజిత్ హీరోయిజాన్ని అభిమానులు ఇష్టపడ్డారు కాబట్టి పొంగల్ మూమెంట్ లో క్లిక్ అయ్యింది. మరి ఇప్పుడు తెలుగులో అజిత్ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. 

PREV
click me!

Recommended Stories

Mahesh Babu ఎవరో నాకు తెలియదు.. ప్రభాస్ తప్ప అంతా పొట్టివాళ్లే.. స్టార్‌ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు
ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ డూప్‌గా చేసింది ఎవరో తెలుసా.? ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారంటే.!