ఫస్ట్ లుక్: మహేష్ 'మేజర్' మూవీ

Published : Feb 27, 2019, 06:51 PM IST
ఫస్ట్ లుక్: మహేష్ 'మేజర్' మూవీ

సారాంశం

యువ నటుడు అడివి శేష్ మరో సరికొత్త ప్రయోగానికి సిద్దమయ్యాడు. క్షణం - గూఢచారి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఈ సారి హిస్టారికల్ కథను టచ్ చేయబోతున్నాడు. మేజర్ అనే టైటిల్ కూడా సెట్ చేసుకున్నాడు. ఇ సినిమాకు మహేష్ నిర్మాణ సంస్థ సహా నిర్మాతగా వ్యవహరిస్తుండం విశేషం. 

ఈ విషయాన్నీ మహేష్ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. 26/11 ముంబై దాడుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఉగ్ర దాడిలో మరణించిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ పాత్రలో అడివి శేష్ కనిపించనున్నాడు. గత కొంత కాలంగా మహేష్ తన ప్రొడక్షన్ బిజినెస్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్న సమయంలో మేజర్ స్క్రిప్ట్ ను మంచి అవకాశంగా భావించారు. 

GMB ప్రొడక్షన్స్ తో పాటు మరో నిర్మాణ సంస్థ సోని పిక్చర్స్ కూడా సినిమాను నిర్మించడానికి సిద్ధమైంది. తెలుగు - తమిళ్ లో రూపొందుతున్న ఈ సినిమాకు సాయి కిరణ్ టిక్కా దర్శకత్వం వహిస్తున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Peddi 15 Days Collections: కొత్త సీన్లు యాడ్ చేసినా లాభం లేదు, రామ్ చరణ్ పెద్ది కలెక్షన్స్ లో భారీ డ్రాప్..
Raghavendra Rao: ఈ వయసులో ఇవేం పనులు, దర్శకేంద్రుడిపై మండిపడుతున్న నెటిజన్లు