Valimai Trailer: అబ్బురపరిచేలా ఛేజింగ్ సీన్లు, విజువల్స్.. అజిత్ తో సై అంటున్న కార్తికేయ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 30, 2021, 07:21 PM IST
Valimai Trailer: అబ్బురపరిచేలా ఛేజింగ్ సీన్లు, విజువల్స్.. అజిత్ తో సై అంటున్న కార్తికేయ

సారాంశం

అజిత్ పేరు వింటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాట అజిత్ కు ఉన్న క్రేజ్ అది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ నుంచి వస్తున్న మరో చిత్రం 'వాలిమై'. తెలుగులో 'బలం' అనే టైటిల్ తో విడుదల కానుంది.

అజిత్ పేరు వింటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ఉన్నారు. తమిళనాట అజిత్ కు ఉన్న క్రేజ్ అది. గత కొన్నేళ్లుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్ నుంచి వస్తున్న మరో చిత్రం 'వాలిమై'. తెలుగులో 'బలం' అనే టైటిల్ తో విడుదల కానుంది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్ర తమిళ ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. 

అజిత్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగానే ట్రైలర్ గ్రాండ్ విజువల్స్ తో అదిరిపోయింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. అజిత్ క్రేజ్ కి తగ్గట్లుగా వినోద్ ఈ చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ , ఛేజింగ్ సీన్లు డిజైన్ చేశారు. ట్రైలర్ లో ప్రతి ప్రేము గ్రాండ్ గా ఆకట్టుకుంటోంది. 

ఛేజింగ్ సీన్లు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా మారనున్నాయి. చెన్నైకి వచ్చిన పవర్ ఫుల్ పోలీస్ గా అజిత్ కనిపిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో తెలుగు హీరో కార్తికేయ విలన్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అజిత్, కార్తికేయ మధ్య మైండ్ గేమ్.. పోరాటాలు ఒక రేంజ్ లో ఉండబోతున్నాయి. 

 

అజిత్ కి జోడిగా ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా క్యురేషి నటిస్తోంది. అజిత్ ఎప్పటిలాగే తన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో దర్శనం ఇస్తున్నాడు. ఇక కార్తికేయ లుక్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలకు తగ్గట్లుగా యువన్ శంకర్ రాజా బ్యాగ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. 

తెలుగు తమిళ భాషల్లో ఒకసారి సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు ట్రైలర్ ని త్వరలో విడుదల చేయనున్నారు. 

Also Read: Samantha: సమంత జోరు ముందు నిలబడలేకపోయిన బోల్డ్ బ్యూటీ

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌