Ajith Valimai : వాలిమై మూవీకి తెలుగులో క్రేజీ టైటిల్..? ఫ్యాన్స్ కు అజిత్ న్యూ ఇయర్ ట్రీట్

By Mahesh Jujjuri  |  First Published Dec 30, 2021, 8:09 AM IST

తమిళ స్టార్ హీరో అజిత్(Ajith) వాలిమై(Valimai) సినిమా రిలీజ్ కు అంతా రెడీ అవుతుంది. క్రేజీ టైటిల్ తో తెలుగులో కూడా అజిత్ మూవీని రిలీజ్ చేయబోతున్నారు టీమ్.


కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith) క్రేజ్ మామూలుగా ఉండదు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అజిత్ సినిమాలంటే.. ఎగబడి చూస్తారు జనాలు. తమిళంలో అయితే విజయ్‌(Vijay), అజిత్ ఫ్యాన్స్ మధ్య యుద్థాలే జరుగుతాయి. ఇక ఈ మధ్య వరుస సక్సెస లతో దూసుకుపోతున్నారు Ajith. రీసెంట్ గా ఆయన నటించిన సినిమా వాలిమై. ఈ మూవీ రిలీజ్ కు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

తమిళ్ లో వాలిమై(Valimai) టైటిల్ తో తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగులో “బలం” టైటిల్ తో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట టీమ్. దీనికోసం అన్న ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 13న  ఈమూవీని రిలీజ్ చేయబోతున్నారు. అంతే కాదు టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ..న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ ట్రైలర్ ను కూడా టీమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ట్రిపుల్ ఆర్(RRR).. రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాల మధ్య ధైర్యంగా మూవీని రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు టీమ్.

Latest Videos

బాలీవుడ్ స్టార్ ప్రోడ్యూసర్ బోనీ కపూర్(Bony Kapoor) నిర్మిస్తున్న ఈమూవీని వినోద్ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ఈమూవీలో అజిత్ కు స్ట్రాంగ్ విలన్ గా టాలీవుడ్ యంగ్ స్టార్ కార్తికేయ నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య యాక్షన్ సీన్స్ ను అద్భుతంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. Ajith  సరసన హీరోయిన్ గా హూమా  ఖురేషీ నటించింది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు.

Also Read : NTR about depression: డిప్రెషన్ కు గురయ్యా, కెరీర్ పడిపోతున్న టైంలో.. ఎన్టీఆర్ ఎమోషనల్ కామెంట్స్

అజిత్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బోనీ కపూర్ నిర్మిస్తుండటంతో పాన్ ఇండియ రేంజ్ లో సినిమాకు క్రేజ్ ఉంది. ఇక అజిత్ ఫ్యాన్స్ అయితే సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కాని ట్రిపుల్ ఆర్..రాధేశ్యామ్  లాంటి పెద్ద సినామాల మధ్య రిలీజ్ అవుతుంది అజిత్ మూవీ.. మరి ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో చూడాలి.

Also Read : Ravi Teja: మాస్ మహారాజ్ దూకుడు మామూలుగా లేదు

 

click me!