జూన్ 7న అజయ్ "స్పెషల్" - ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్

Published : May 07, 2019, 05:18 PM IST
జూన్ 7న అజయ్ "స్పెషల్" - ది స్టోరీ ఆఫ్ ఏ మైండ్ రీడర్

సారాంశం

యాక్టర్ అజయ్ ఒక అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్న స్పెషల్ చిత్రంలో ముఖ్య భూమిక పోషించారు. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ.

తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని నటుడు అజయ్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడులో ప్రతి నాయకుడిగా నటించి అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకొని, పలు చిత్రాల్లో హీరోగా, విలన్ గా, సహాయ నటుడిగా నటిస్తూ మంచి పేరు సంపాదించుకున్నాడు అజయ్. 

ఇక ఇప్పుడు ఓ అద్భుతమైన స్టోరీ స్క్రీన్ ప్లే తో తెరకెక్కిస్తున్న స్పెషల్ చిత్రంలో ముఖ్య భూమిక పోషించారు. ఇది ఒక మైండ్ రీడర్ లవ్ రివెంజ్ స్టోరీ. ఓ వ్యక్తిని ఒకమ్మాయి లవ్ చేసి వదిలేస్తుంది. చీట్ చేస్తుంది. ఆ అమ్మాయి అలా అతన్ని చీట్ చేయడానికి కారణమైన వాళ్లమీద ఈ మైండ్ రీడర్ రివెంజ్ తీర్చుకుంటాడు. మనుషుల్ని టచ్ చేసి వాళ్ల మైండ్ రీడ్ చేసే ఒక పారా సైకాలజీ స్కిల్ నేపథ్యంలో సాగుతుంది.  

హాలీవుడ్ తరహా కథాంశంతో తీసిన ఔట్ అండ్ ఔట్ ఎంటర్ టైనర్ ఇది. ఇందులో అజయ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. నందలాల్ క్రియేషన్స్ పతాకంపై నందమ్ శ్రీవాస్తవ్ నిర్మాతగా, వాస్తవ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది.  జూన్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా