మన్మథుడు 2లో మరో స్పెషల్ గెస్ట్?

Published : May 07, 2019, 04:56 PM IST
మన్మథుడు 2లో మరో స్పెషల్ గెస్ట్?

సారాంశం

  కింగ్ నాగార్జున గత కొంత కాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మన్మథుడు సీక్వెల్ తో సిద్దమవుతున్నాడు.

కింగ్ నాగార్జున గత కొంత కాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మన్మథుడు సీక్వెల్ తో సిద్దమవుతున్నాడు. కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చిన మన్మథుడు సెంటిమెంట్ ఎంతవరకు ఉపయోగపడుతుందో గాని సినిమాకు హైప్ తేవడంలో నాగార్జున ఏ మాత్రం తగ్గడం లేదు. 

ఇప్పటికే సమంత సినిమాలో అతిధి పాత్రలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక మహానటి ఫెమ్ కీర్తి సురేష్ కూడా మన్మథుడితో కొన్ని నిమిషాలు  స్క్రీన్ షేర్ చేసుకోనుందని సమాచారం. ఇది ఎంతవరకు నిజమో తెలియదు గాని సినిమాలో ఒక స్పెషల్ గెస్ట్ ఉండే ఛాన్స్ ఉందని ఇన్ సైడ్ టాక్. గతంలో కింగ్ సినిమాలో కూడా నాగ్ పాటలో అప్పటి యంగ్ హీరోయిన్స్ ని పిలిచి అభిమానులకు షాక్ ఇచ్చాడు. 

ఇక ఇప్పుడు మాత్రం హీరోయిన్స్ ని సీన్స్ లోకి రప్పిస్తూ సరికొత్త కిక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాకు చిలాసౌ ఫెమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సినిమాకు సంబందించిన మెజర్స్ సీన్స్ ని పోర్చుగల్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక సినిమాలో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా