ఇండస్ట్రీలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.. సమీరా రెడ్డి కామెంట్స్!

Published : May 07, 2019, 05:00 PM IST
ఇండస్ట్రీలో నన్ను చాలా ఇబ్బంది పెట్టారు.. సమీరా రెడ్డి కామెంట్స్!

సారాంశం

ఇండస్ట్రీలో మహిళలను చాలా తక్కువగా చూస్తుంటారని నటి సమీరా రెడ్డి వాపోయింది. 

ఇండస్ట్రీలో మహిళలను చాలా తక్కువగా చూస్తుంటారని నటి సమీరా రెడ్డి వాపోయింది. మహిళలను ట్రీట్ చేసే విధానం మారాలంటూ కామెంట్స్ చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమీరా రెడ్డి కొన్ని సంచలన కామెంట్స్ చేసింది.

ఇండస్ట్రీలో మహిళలకు అవకాశాలను ఎరగా చూపిస్తూ వాడుకోవాలనుకుంటారని, చాలా రకాలుగా ఇబ్బంది  పెడుతుంటారని, మహిళ అంటే కేవలం గ్లామర్ వస్తువుగానే చూస్తారంటూ సంచలన కామెంట్స్ చేసింది. తాను కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది.

అంతేకాకుండా పరిశ్రమలో పురుషులను, స్త్రీలను సమానంగా చూడరని, రెమ్యునరేషన్ విషయంలోనే కాకుండా గౌరవం విషయంలో కూడా అసమానతలు స్పష్టంగా కనిపిస్తాయని అన్నారు. మహిళల విషయంలో పరిశ్రమ ఆలోచన మారాలని, ఎంత త్వరగా మార్పు వస్తే అంత మంచిదని అంటోంది.

మీటూ లాంటి ఉద్యమాల కారణంగా ఇప్పుడిప్పుడే మార్పు మొదలైందని,అయితే ఇంకా అడుగులు చాలా మెల్లగా పడుతున్నాయని.. త్వరగా మార్పు వస్తే మంచిదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం గర్భవతి అయిన సమీరా  రెడ్డి త్వరలోనే తన రెండో బిడ్డకు జన్మనివ్వనుంది.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా