తమిళ స్టార్ కార్తీ నటించిన ‘ఖైదీ’కి హిందీ రీమేక్ గా వస్తున్న చిత్రం ‘భోళా’. అజయ్ దేవగన్ నటించి, దర్శకత్వం వహించారు. చిత్ర ట్రైలర్ తాజాగా విడుదలై.. ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ (Ajay Devgn) చివరిగా తెలుగులో ‘ఆర్ఆర్ఆర్’తో అలరించారు. పవర్ ఫుల్ రోల్ లో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం Bholaa చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ సినిమా తమిళ స్టార్ Karthi నటించిన ‘ఖైదీ’ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. హిందీలో ‘భోళా’గా అజయ్ దేవగన్, టబు కాంబినేషన్ లో తెరకెక్కుతోంది. అజయ్ దేవగన్ దర్శకత్వం వహించారు. టీ-సిరీస్, అజయ్ దేవగన్ ఫిల్మ్స్, రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించాయి. మార్చి 30న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది.
ప్రస్తుతం చిత్ర ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు యూనిట్. ఈ సందర్భంగా ఇప్పటికే పలు అప్డేట్స్ తో ఆకట్టుకోగా.. తాజాజా Bhola Trailerను విడుదల చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు. ట్రైలర్ దూసుకుపోతోంది. టైటిల్ పాత్రలో అజయ్ దేవగన్ నటించగా.. పోలీస్ పాత్రలో టబు నటిస్తున్నారు. చిత్రంలో చాలా యాక్షన్ సన్నివేశాలను చూపించబోతున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటున్నాయి. ‘ఖైదీ’ కంటే మరిన్ని యాక్షన్ సీన్స్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారని అర్థం అవుతోంది. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమాపై హైప్ ను పెంచేస్తున్నారు. అయితే ఇప్పటికే ‘ఖైదీ’ చూసిన ఆడియెన్స్, కొంతమంది నెటిజన్లు ట్రైలర్ లోని కొత్త యాక్షన్ సీన్స్, స్టంట్స్ కు ఫిదా అవుతున్నా.. మరికొన్ని మాత్రం నప్పలేదని తమ అభిప్రాయాలను వక్తం చేస్తున్నారు.
తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ రచించి, దర్శకత్వం వహించిన ‘ఖైదీ’ చిత్రం 2019లో విడుదలై బ్రహ్మండమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. కేవలం 25 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక అజయ్ దేవగన్ హిందీలో రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను ఎలాంటి ఆకట్టుకుంటోందో చూడాలి. నెలాఖరులో త్రీడీ, టూడీలలో చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.
's Trailer Out Now !!
- https://t.co/3oWIsnlEnd pic.twitter.com/jfw8FgXCV0