
కృతి శెట్టి కెరీర్ కొద్దిగా నెమ్మదించింది. ఆమెకు గత ఏడాది అంతగా కలిసి రాలేదు. బంగార్రాజు మినహాయిస్తే... మిగతా మూడు చిత్రాలు పరాజయం పాలయ్యాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చిత్రాలు బోల్తా కొట్టాయి. లక్కీ హీరోయిన్ ట్యాగ్ కి ఆమెను దూరం చేశాయి. హ్యాట్రిక్ ప్లాప్స్ తర్వాత కృతి శెట్టికి ఆఫర్స్ ఇచ్చేందుకు మేకర్స్ భయపడుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తెలుగు చిత్రాలు మాత్రమే ఉన్నాయి. నాగ చైతన్యకు జంటగా కస్టడీ చిత్రం చేస్తుంది. గతంలో వీరి కాంబోలో బంగార్రాజు విడుదలైంది.
అలాగే శర్వానంద్ కి జంటగా ఒక చిత్రం చేస్తున్నారు. ఒక మలయాళ చిత్రానికి సైన్ చేశారు. అది షూటింగ్ జరుపుకుంటుంది. మరో కన్నడ బ్యూటీ శ్రీలీల నుండి కృతి శెట్టికి గట్టి పోటీ ఎదురవుతుంది. సునామీలా దూసుకొచ్చిన శ్రీలీల ఆమె ఆఫర్స్ మొత్తం దోచేస్తుంది. ప్రస్తుతం శ్రీలీల మహేష్, పవన్ కళ్యాణ్,బాలకృష్ణతో పాటు పలు చిత్రాలు సైన్ చేశారు. ఇవన్నీ శ్రీలీలకు దక్కాల్సిన అవకాశాలే అంటున్నారు. శ్రీలీల రష్మిక, పూజా హెగ్డేలకు కూడా దెబ్బేసింది అంటున్నారు.
అయితే కీర్తికి ఇంకా ఛాన్స్ ఉంది. రానున్న నాగ చైతన్య, శర్వానంద్ చిత్రాలు విజయం సాధించిన నేపథ్యంలో మరలా ఆమె కోసం దర్శక నిర్మాతలు ఎగబడే రోజు రావచ్చు. అందులోనూ అమ్మడు వయసు కేవలం 20 ఏళ్లే. నిరూపించుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. కాగా మరోవైపు సోషల్ మీడియా వేదికగా సత్తా చాటుతుంది. గ్లామరస్ ఫోటో షూట్స్, వీడియోలు షేర్ చేస్తుంది. కృతి శెట్టి గతంలో వారసుడు చిత్రంలోని డ్యూయెట్ కి కిరాక్ స్టెప్స్ వేసింది. టైట్ డ్రెస్ లో కృతి రెచ్చిపోగా... ఆ వీడియో వైరల్ గా మారింది.