టాలీవుడ్ లో హీరోయిన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంది. అందులో ఓ హీరోయిన్ 14 ఏళ్ళకే హీరోయిన్ అయ్యింది. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ గా మారిన ఆఅందాల భామ ఎవరో తెలుసా..?
టాలీవుడ్ లో హీరోయిన్లకు ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉంది. అందులో ఓ హీరోయిన్ 14 ఏళ్ళకే హీరోయిన్ అయ్యింది. డాక్టర్ అవ్వబోయి యాక్టర్ గా మారిన ఆఅందాల భామ ఎవరో తెలుసా..?
ఇప్పుడంటే టాలీవుడ్ లో అచ్చతెలుగు హీరోయిన్లు లేరు కాని.. ఒకప్పుడు మాత్రం మన తెలుగు భామలే హీరోయిన్లు గా స్టార్ డమ్ ను చూశారు. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా వారి సత్తా చాటారు. జయప్రద, జయసుధ, జయచిత్ర, శారద, వాణిశ్రీ, ఇలా చాలామంది తారలు తెలగు నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలారు. అందులో చాలామంది రాజకీయాల్లో కూడా రాణించారు.
ఇదిగో పైన కనిపిస్తున్న ఈ హీరోయన్ కూడా ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో స్టార్ డమ్ చూసింది. ఇండియన ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటింది. 14 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వచ్చీ రావడంతోనే అన్నీ హిట్ సినిమాలతో ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ తో మెప్పించి దశాబ్ధాల పాటు వెలుగు వెలిగింది. ఇంతకీ ఎవరీ హీరోయిన్ మీరు కనిపెట్టారా..? ఆమె ఎవరో కాదు జయప్రద,
హీరోయిన్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. స్టార్ డమ్ ను చూసిన జయప్రద..తన అందం, అభినయంతో అప్పట్లో ఓ వెలుగు వెలిగింది. ఆతరువాత హీరోయిన్ గా అవకాశాలు తగ్గగానే క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించింది. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో అడియన్స్ హృదయాలను గెలుచుకుంది సీనియర్ బ్యూటీ. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, కమల్ హాసన్, కృష్ణ, శోభన్ బాబు, వంటి అలనాటి హీరోలందరితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు జయప్రద.
అంతే కాదు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలలోనూ సినిమాలు చేసి.. పాన్ ఇండియా హీరోయిన్ గా పేరు తెచ్చుకున్నారు. సినిమాలు మాత్రమే కాదు జయప్రద రాజకీయాల్లో కూడా తన సత్తా చాటింది.
1976లో రిలీజ్ అయిన భూమి కోసం సినిమాతో జయప్రద తెరంగేట్రం చేసింది. ఈసినిమాలో ఆమెది కేవలం మూడు నిమిషాల పాత్ర. అంతే కాదు ఈ పాత్ర కోసం ఆమెను తీసుకువచ్చింది ఎవరో కాదు.. ఓల్డ్ యాక్టర్ ప్రభాకర్ రెడ్డి. స్కూల్లో జయప్రద నాట్యం చేస్తుంట చూసిన ఆ పెద్దాయన వెంటనే ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేయాల్సిందే అని పట్టుబట్టి తీసుకువచ్చారు. అలా మొదలైన జయప్రద సినిమా ప్రస్థానం.. 30 ఏళ్లు నిర్విరామంగా సాగింది.
ఒరేయ్ తమ్ముడు అంటూ.. సావిత్రి ప్రేమగా పిలిచే స్టార్ డైరెక్టర్
197 నుంచి 2005 వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్రంత తిప్పింది జయప్రద. అయితే ముందుగా ఆమె హీరోయిన్ అవ్వాలని అనుకోలేదట. చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలను కన్న ఆమెకు అనుకోకుండా సినిమా అవకాశం రావడం.. వెంటనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది జయప్రద.
ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే.. నటిగా జయప్రద తొలి సినిమాకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. ఆమె ఫస్ట్ మూవీకి పది రూపాయాలు పారితోషికం తీసుకుంది. వివిధ భాషల్లో మొత్తం 300లకు పైగా సినిమాల్లో నటించి ఈ సీనియర్ నటి. చిత్రాల్లో నటించి అలరించారు. కానీ తొలి సినిమాకు రూ.10 రెమ్యునరేషన్ తీసుకున్న ఈ హీరోయిన్ ఆ తర్వాత భారతదేశంలో అత్యధిక పారితోషికం అందుకునే నటిగా మారింది.
జయప్రద సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె తెలుగు రాష్ట్రాల్లోనే కాదు కేంద్రంలో కూడా చక్రం తిప్పింది. ముందుగా 1994 అక్టోబర్ 10న టీడీపీలో చేరిన ఆమె.. ఆ తర్వాత సెంట్రల్ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. విచిత్రం ఆమెకు నార్త్ లో బాగా ఆదరణ లభించింది. దాంతో ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు జయప్రద.
శ్రీదేవికి అహంకారం ఎక్కువ.. జయప్రద కామెంట్స్..
తెలుగు హీరోయిన్ అయ్యుండి.. ఉత్తరప్రదేశ్ ప్రాంతీయ పార్టీ అయిన సమాజ్ వాద్ పార్టీలో చేరారు. అక్కడ ముఖ్య నేత రామ్ సింగ్ తో ఆమెకు ఎక్కువ సాన్నిహిత్యం ఉండేది. సుదీర్ఘకాలం ఎన్సీపి లో కొనసాగిన జయప్రద.. ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా గెలిచి పార్లమెంటకు వెళ్లారు. తరువాతి కాలంలో ఆ పార్టీలో వచ్చిన సంక్షోబం తరువాత పార్టీని వీడి బయటకు వచ్చారు. ప్రస్తుతం జయప్రద బిజేపీలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది.
1986 జూన్ 22న సినీ నిర్మాత నహతాను వివాహం చేసుకున్నారు. జయప్రద భర్త పేరు శ్రీకాంత్ నహతా, ఈయన ఒకప్పటి ప్రముఖ నిర్మాత. అయితే జయప్రద పెళ్ళి ఎన్నో వివాదాలకు దారితీసింది. నహతా అప్పటికే వివాహితుడు కావడంతో ఈ గొడవలు పెద్దవి అయ్యాయి. అయితే, నహతా తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో సమస్య పెద్దదిగామారింది.
సమంత బల్గారీ వాచ్.. రేటు తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోవల్సిందే..
ఇక ఈ విదాదాల నుంచి బయటపడటం కోసం ఆమె రాజకీయాలను ఎంచుకున్నారు. జయప్రదకు సినిమాలు తగ్గడంతో.. ఆమె స్థానంలో శ్రీదేవి అల్లుకుపోయింది. వరుసగా సినిమాలు చేస్తూ.. జయప్రదకు ఒక్క ఛాన్స్ కూడా రాకుండా చేసింది. దాంతో జయ ఫుల్ టైమ్ పొలిటీషియన్ గా మారింది. అడపా దడపా సినిమాలు చేస్తూ.. ఎక్కువ టైమ్ పాలిటిక్స్ కే ఇచ్చేసింది.