అల్లు అర్జున్, శ్రీలీల ఇటీవల ప్రముఖ విద్యా సంస్థను ప్రమోట్ చేస్తూ యాడ్‌లో నటించారు. అదే గొప్ప ఎడ్యూకేషన్ ఇనిస్టిట్యూట్‌గా వర్ణించారు. ఈ క్రమంలో దీనిపై విద్యార్థి సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. స్టూడెంట్స్ ని, పేరెంట్స్ ని తప్పుదోవ పట్టిస్తున్నారని స్టూడెంట్స్ ఆర్జనైజేషన్స్ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మొన్నటి వరకు `సంధ్య` థియేటర్ వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరో వివాదం ఆయన్ని వెంటాడుతుంది.పలు ఎడ్యూకేషన్ సంస్థలను ప్రమోట్ చేసే విషయంలో అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్టూడెంట్స్ యూనియన్స్. బన్నీతోపాటు హీరోయిన్ శ్రీలీలపై కూడా కేసులకు వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు.
కార్పొరేట్ కాలేజీలకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటూ విద్యార్థులను, పేరెంట్స్ ని తప్పుదోవ పట్టిస్తున్న అల్లు అర్జున్, శ్రీలీలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు. అంతేకాదు ఈ క్రమంలో ప్రముఖ విద్యాసంస్థలపై కూడా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అల్లు అర్జున్, శ్రీలీల కొన్ని విద్యాసంస్థలను సమర్థించి విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారని, శ్రీ చైతన్యలో విద్యార్థులు తప్ప మరెవరూ మంచి ర్యాంకులు పొందరని, వారు మాత్రమే మంచి విద్యని అందిస్తున్నారని వారు చెబుతున్నారని,
అలాంటి వారిని నమ్మి స్టూడెంట్స్ లక్షల ఫీజులు చెల్లించి ఆయా విద్యా సంస్థల్లో చేరితే చాలా ఇబ్బందులు పడుతున్నారని, హాస్టల్స్ లో అనేక సమస్యలను ఫేస్ చేస్తున్నారని ఆరోపించారు. కాసుల కోసం సెలబ్రిటీలు విద్యార్థులను తప్పుదారి పట్టిస్తున్నారు ఆరోపిస్తున్నారు.
అంతేకాదు ఈ విషయంలో విద్యా సంస్థలపై కూడా వారు మండిపడ్డారు. జీఈఈ మెయిన్ ఫలితాల్లో తప్పుడు ర్యాంకులను ప్రచారం చేస్తున్న శ్రీ చైతన్య, నారాయణ విద్యా సంస్థల యాజమాన్యాలపై చీటింగ్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది.
దీంతో ఇప్పుడిది పెద్ద హాట్ టాపిక్ అవుతుంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏఐఎస్‌ఎఫ్ నాయకులు ఈ డిమాండ్‌కి పిలుపునిస్తూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ మొన్నటి వరకు `పుష్ప 2` రిలీజ్ సమయంలో `సంధ్య` థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక మహిళ చనిపోగా, వాళ్ల అబ్బాయి కోమాలోకి వెళ్లాడు.
దీంతో తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ కూడా చేశారు. ఒక రోజు జైల్లో కూడా ఉండాల్సి వచ్చింది. ఈ కేసు తెలంగాణ స్టేట్‌ని షేక్ చేసింది. దీని కారణంగా బన్నీ తన `పుష్ప 2` సక్సెస్‌ని కూడా ఎంజాయ్ చేయలేకపోయారు.