కీరవాణి ఎలాంటివారో ప్రతి సింగర్‌ చెబుతారు, హారికా నారాయణ్‌ స్టేట్‌మెంట్‌ వైరల్‌.. వీడియో ఉపయోగించడంపై ఫైర్‌

Singer Harika Narayan: చిత్ర పరిశ్రమలో మ్యూజిక్‌ రంగం సినిమాల్లో పాటల విషయంలో తప్ప, ఎప్పుడూ పెద్దగా ఎక్స్ పోస్‌ కాదు. ఈరంగానికి ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. వాళ్లని సరస్వతి పుత్రులుగా భావిస్తుంటారు. వివాదాలకు దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు సడెన్‌గా చర్చనీయాంశం అయ్యింది. లేడీ సింగర్‌ ప్రవస్తి చేసిన ఆరోపణలు ఇండస్ట్రీలో పెద్ద రచ్చ అవుతున్నాయి. మీడియా దీన్ని ఎక్స్ పోజ్‌ చేయడంతో మరింతగా రచ్చ అవుతుంది. 
 

singer harika Narayan support to mm Keeravani video viral in telugu arj

Singer Harika Narayan: `పాడుతా తీయగా` కార్యక్రమంలో జడ్జ్ లు ఎంఎం కీరవాణి, సింగర్‌ సునీతలు తనకు అన్యాయం చేసినట్టుగా సింగర్‌ ప్రవస్తి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ వివాదం కాస్త పెద్దదవుతుంది.  ఈ క్రమంలో తాజాగా మరో లేడీ సింగర్‌ హరికా నారాయణ్‌ స్పందించారు. ఆమె ఆస్కార్‌ విన్నింగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కీరవాణిపై ప్రశంసలు కురిపించారు. ఆయన్ని ఆకాశానికి ఎత్తేశారు. మరి ఆమె ఎందుకు స్పందించింది? ఆమె ఏం చెప్పిందనేది చూస్తే. 

టీవీ ఛానెల్‌ తన వీడియోని చూపించడంపై సింగర్‌ హారిక నారాయణ్‌ అభ్యంతరం..

సింగర్‌ ప్రవస్తి చాలా టీవీ ఛానెల్స్ డిబేట్లో పాల్గొంది. అనేక ఆరోపణలు చేసింది. `పాడుతా తీయగా`లో అసలు ఏం జరుగుతుందో చెప్పింది. ఈ క్రమంలో ఓ టీవీ ఛానెల్‌లో హరికా నారాయణ్‌.. కీరవాణితో ఉన్న వీడియో చూపించారు యాంకర్‌. అందులో హారికా తన ప్రైవేట్‌ సాంగ్‌(వీక్షణ)ని ప్రమోట్‌ చేసుకుంటూ పెట్టింది. దాన్ని టీవీలో చూపించి వ్యంగ్యంగా మాట్లాడటం పట్ల ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అది పూర్తిగా తన ఇష్టమని, తన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలను ఎలా చూపిస్తారంటూ ఆమె మండిపడింది. 

కీరవాణి లెజెండ్‌.. ఆయన చిన్న పాటకి సపోర్ట్ చేయడం గొప్ప విషయం..

Latest Videos

ఈ సందర్భంగా కీరవాణిపై ప్రశంసలు కురిపించింది. వీక్షణ అనే తన ప్రైవేట్‌ సాంగ్‌ని లెజెండ్‌ కీరవాణి చేతుల మీదుగా ఆయన ఆశీస్సులతో విడుదల చేయడం జరిగిందని, దీన్ని రీల్‌ కింద పోస్ట్ చేసినట్టు తెలిపింది హారికా నారాయణ్‌. అయితే ఒక టీవీ ఛానెల్‌లో తన వీడియోని రాంగ్‌ కాంటెక్ట్స్ లో వినియోగించి దానిపై జడ్జ్ మెంట్ పాస్‌ చేశారని ఆమె వెల్లడించింది. తనకు అది నచ్చలేదని, ఒక లెజెండరీ పర్సన్‌ ఒక చిన్న మ్యూజిక్‌ వీడియోని సపోర్ట్ చేయడమనేది చాలా  గొప్ప విషయమని,  ఇది ఆయన కొత్త వారిని ఎలా ఎంకరేజ్‌ చేస్తారనేదానికి ఉదాహరణగా చెప్పొచ్చు అని వెల్లడించింది. 

కీరవాణి కొత్త వాళ్లని ఎంతగానో ప్రోత్సహిస్తారు..

`ఆ వీడియోలో కీరవాణిగారి ముందు నిల్చోవడం అది నా ఛాయిస్‌. ఆయన్ని తాను గురువులా భావించి ఆయనకు ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ అది. కీరవాణి దగ్గర పనిచేసే ఏ సింగర్‌నైనా, ఏ మ్యూజీషియన్‌ ని అయినా అడగొచ్చు ఆయన ఎలాంటి వారో, ఆయన వ్యాల్యూస్‌ ఎలాంటివో, సాటి మనిషికి ఆయన ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుందో. మ్యూజిక్‌ మాత్రమే కాదు విలువలు, జీవితానికి సంబంధించి ఆయన వద్ద నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇది పూర్తిగా నా ఫీలింగ్‌. అలాంటి వ్యక్తి గురించి నిజం తెలుసుకోకుండా రాంగ్‌గా చెప్పడం నచ్చలేదు, అగౌరవంగా అనిపించింది. ఈ నెగటివిటీని ఇకపై ఆపేస్తారని భావిస్తున్నా` అని తెలిపింది హారిక నారాయణ్‌. ప్రస్తుతం ఆమె వీడియో వైరల్‌ అవుతుంది. 

ఇదిలా ఉంటే సింగర్ ప్రవస్తి.. సింగర్‌ సునీత, చంద్రబోస్‌లతోపాటు కీరవాణిపై కూడా ఆరోపణలు చేసింది. ఆయన కూడా చులకన చేసి మాట్లాడతాడని, అవమానించేలా మాట్లాడతాడని ఆమె ఆరోపించింది. ఈ క్రమంలో కీరవాణిపై హారిక నారాయణ్‌ ప్రశంసలు కురిపించడం, ఆయనకు సపోర్ట్ గా పోస్ట్ పెట్టడం గమనార్హం. ఇది పరోక్షంగా సింగర్‌ ప్రవస్తిని టార్గెట్‌ చేయడమే అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 
 

vuukle one pixel image
click me!