
బాలీవుడ్‌లో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ టాక్ షో ` కాఫీ విత్ కరణ్` (Koffee With Karan) ప్రముఖ దర్శక, నిర్మాత కరణ్ జోహార్(Karan Johar) నిర్వహించే టాక్ షో ఇది. సెలబ్రిటీలతో ఇందులో చిట్‌చాట్ చేస్తారు కరణ్. ఈ షోలో అనేక రహస్యాలను బయటపెడతారు కరణ్. సెలబ్రిటీల సీక్రెట్స్, లవ్, బ్రేకప్, ఎఫైర్స్, సాడ్స్ ఇలా అన్నింటిని ఆయన ఓపెన్‌గా అడుగుతూ, వాటిని బయటకు తీస్తుంటారు. అందుకే ఈ షో దేశ వ్యాప్తంగా చాలా పాపులారిటీని పొందింది.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది `కాఫీ విత్ కరణ్`. ఇక త్వరలోనే ఏడో సీజన్ ప్రారంభం కాబోతుందనే వార్తలు ఊపందుకున్న నేపథ్యంలో తాజాగా పెద్ద షాకిచ్చాడు వ్యాఖ్యాత కరణ్ జోహార్. ఇకపై `కాఫీవిత్ కరణ్` షో ఉండదని వెల్లడించింది. చాలా బాధతో ఈ విషయాన్ని చెబుతున్నానని వెల్లడించారు. `హలో, `కాఫీ విత్ కరణ్` 6 సీజన్‌లుగా నా జీవితంలో , మీ జీవితంలో ఒక భాగమైంది. పాప్ సంస్కృతి చరిత్రలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నామని, మేము ప్రభావం చూపామని నేను అనుకుంటున్నాను. `కాఫీ విత్ కరణ్` ఇక తిరిగి రాదని బరువెక్కిన హృదయంతో ప్రకటిస్తున్నా` సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు కరణ్. దీంతో అభిమానులు, బాలీవుడ్ ఆడియెన్స్ షాక్‌కి గురి చేశారు.
అయితే కాసేపటికి మరో ట్విస్ట్ ఇచ్చాడు కరణ్ జోహార్. ఈ షోకి సంబంధించి బిగ్ అప్‌డేట్ ఇచ్చాడు. `కాఫీ విత్ కరణ్` టాక్ షో ఇకపై టీవీలో ప్రసారం కాదని, కానీ ఓటీటీ(Koffe with Karan OTT)లో వస్తుందని చెప్పారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఇది స్ట్రీమింగ్ అవుతుందన్నారు. వచ్చే ఏడో సీజన్ నుంచి ఓటీటీలో ప్రసారం కాబోతుందని చెప్పి సర్‌ప్రైజ్ చేశారు. మొత్తానికి ఈ వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అయితే ఓటీటీ సీజన్‌లో కొత్తగా పెళ్లైన అలియాభట్, రణ్‌బీర్ కపూర్ గెస్ట్ లుగా రానున్నట్టు టాక్.