
అనసూయ అభిమానులతో ఆన్లైన్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక నెటిజన్ ఆమెను ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. మేడమ్ మీకు ఎవరి మీదైనా క్రష్ ఉందా? ఉంటే అది ఎవరో చెప్పాలని అడిగారు. దానికి అనసూయ ''22 ఏళ్లుగా ఈయన(భరద్వాజ్)మీదే నా క్రష్. అదే కదా కష్టం, సుఖం రెండు'' అని సమాధానం చెప్పారు. 37 ఏళ్ల వయసున్న అనసూయకు 22 ఏళ్ల నుండి భర్త పై క్రష్ ఏంటి... అసలు వీరికి వివాహం ఎప్పుడు జరిగింది? అనే సందేహాలు రావచ్చు.
అనసూయది లవర్ మ్యారేజ్. భరద్వాజ్ తో ఆమె ప్రేమ స్కూల్ డేస్ లోనే మొదలైంది. మరలా ఒకే స్కూల్, కాలేజ్ కాదు. అనసూయ ఎన్ సి సి క్యాడెట్. భరద్వాజ్ సైతం ఎన్ సి సి చేశాడట. ఓ క్యాంపులో ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది. అనసూయ-భరద్వాజ్ ఏళ్ల తరబడి ప్రేమించుకున్నారు. వీరి ప్రేమకు పేరెంట్స్ అడ్డు చెప్పారు. పెద్దలు అంగీకారం తెలిపే వరకు వేచి చూసి అనంతరం వివాహం చేసుకున్నారు. ఆ విధంగా వీరి పరిచయానికి 22 ఏళ్ళు. తన ఫస్ట్ లవ్ అండ్ లాస్ట్ లవ్ భరద్వాజే. ఆయన మీదే నా క్రష్ ని అనసూయ చెప్పారన్నమాట.
ఈ చాట్ లో అనసూయ ఇంకా పలు ఆసక్తికర విషయాల మీద స్పందించారు. ఓ అభిమాని మీరు నిజంగా లిబరల్, మెట్యూర్డ్ ఉమన్ అయితే నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. మీకు ఎప్పుడైనా లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు అయ్యాయా? అని అడిగారు. ఈ ప్రశ్నకు అనసూయ స్పందించారు. 'మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో స్వలింగ సంపర్కులు ఉన్నారు. అయితే పర్సనల్ గా నాకు లెస్బియన్స్ తో అలాంటి అనుభవాలు కాలేదు. ఆన్లైన్లో మాత్రం చాలా సార్లు అనుభవమైందని కామెంట్ చేశారు.
డైరెక్ట్ గా నేను లెస్బియన్స్ తో శృంగారంలో పాల్గొనలేదు. అయితే ఆన్లైన్ లో ఎదురయ్యాయని అనసూయ చెప్పారు. మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లో గే లు ఉన్నారని చెప్పడం ఊహించని పరిణామం. ఇక ఆన్లైన్ లో లెస్బియన్ అనుభవాలు అయ్యాయని చెప్పి అనసూయ అతిపెద్ద చర్చకు దారితీసింది. ఈ చాట్ లో అనసూయ బుల్లితెర షోల మీద కూడా ఆరోపణలు చేయడం కొసమెరుపు. మీరు యాంకర్ గా బుల్లితెరకు ఎప్పుడు తిరిగి వస్తారని ఒకరు అడిగారు.
టీఆర్పీ కోసం మేకర్స్ చేస్తే అవమానకర స్టంట్స్ పోతేకాని నేను రాను. అది జరగని పని కాబట్టి బహుశా నేను మరలా యాంకరింగ్ చేయకపోవచ్చని వెల్లడించారు. ఈ చాట్ లో అనసూయ సోషల్ మీడియా ట్రోలింగ్ తో పాటు సీరియస్ మేటర్స్ మీద తన స్పందన తెలియజేశారు. ఈ మధ్య అనసూయ భారీగా ట్రోల్స్ కి గురవుతున్నారు. అదే స్థాయిలో ఆమె చర్యలు తీసుకుంటున్నారు. హద్దు మీరి ప్రవర్తిస్తే సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేస్తున్నారు. ఇప్పటికే పలువురిని అనసూయ అరెస్ట్ చేయించడం విశేషం. మరోవైపు అనసూయ చేతినిండా సినిమాలు, సిరీస్లతో బిజీగా ఉన్నారు. ఆమె కెరీర్ ప్రస్తుతం పీక్స్ లో ఉందని చెప్పొచ్చు.