Pushpa: ఫస్ట్ డే క‌లెక్ష‌న్స్‌ ,ఆంధ్రాలో దెబ్బే

By Surya Prakash  |  First Published Dec 18, 2021, 4:09 PM IST

పుష్ప సినిమాకు 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకు మంచి వసూళ్లే వచ్చాయి. 


అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా హై ఎక్సపెక్టేషన్స్ తో విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ కూడా అదే స్దాయిలో వచ్చాయి. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. అయితే అల వైకుంఠపురములో సినిమా కలెక్షన్స్ మాత్రం అధిగమించలేకపోయిందని ట్రేడ్ టాక్. తొలిరోజు ఏపీ, తెలంగాణలో దాదాపు 25 కోట్ల షేర్ వసూలు చేసింది పుష్ప.

 పుష్ప నైజాం లో ఫస్ట్ డే ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ బ్రద్దలు కొట్టింది. కానీ మైండ్ బ్లాంక్ అయ్యేలా  ఆంధ్రలో లో దెబ్బ పడింది. టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు లేక పోవడం, 4 షోలు మాత్రమే ఉండటం తో కలెక్షన్స్ పై తీవ్రమైన ఇంపాక్ట్ పడిందని సమాచారం. అవలీలగా ఫస్ట్ డే 30 కోట్లకు చేరుకోవాల్సిన సినిమా తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్, ఆంధ్రలో ఉన్న పరిస్థితుల వలన 25 లోపే ఆగిపోయాయి అంటున్నారు. అందులో కూడా వర్త్ హైర్స్ యాడ్ అవ్వగా అవి తీసేస్తే ఫస్ట్ డే షేర్ 22 కోట్ల రేంజ్ లో సొంతం అయ్యింది.

Latest Videos

సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కూడా అల్లు అర్జున్ యాక్టింగ్‌ ఓ రేంజిలో ఉంది అని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతుండటంతో.. ఈ సినిమా కమర్షియల్‌గా సేఫ్ అవుతుందనే అంటున్నారు. పుష్ప సినిమాకు 150 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో 102 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. ఓవర్సీస్‌లో రూ.4.5కోట్లు వసూలు చేసిందని టాక్. ఓవరాల్‌గా ఈ సినిమా 39కోట్ల దగ్గర ఆగిపోయిందని ట్రేడ్‌ వర్గాల టాక్‌.

 సినిమా    కలెక్షన్స్ 
👉నైజాం: 11.44కోట్లు
👉సీడెడ్: 4.20కోట్లు(1.12కోట్లు)
👉ఉత్తరాంధ్ర: 1.8కోట్లు
👉ఈస్ట్ గోదావరి: 1.43కోట్లు(33లక్షలు hires)
👉వెస్ట్ గోదావరి: 1.5కోట్లు(61లక్షలు Hires)
👉గుంటూరు: 2.28కోట్లు(1.55కోట్లు Hires)
👉కృష్ణా: 1.15కోట్లు
👉నెల్లూరు: 1.10కోట్లు(21లక్షలు hires)
AP-TG టోటల్:- 24.90కోట్లు(35.5కోట్లు~ Gross)(3.82కోట్లు Hires)

ఓవర్సీస్‌ రూ.4.5కోట్లు.
 
 

click me!