Sai dharam tej: సాయి ధరమ్ తేజ్ లో ఆ మార్పు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది!

By team telugu  |  First Published Nov 6, 2021, 4:24 PM IST

అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్ధనలతో సాయి ధరమ్ పూర్తిగా కోలుకున్నాడు. నిన్న మెగా హీరోలందరూ ఆయనకు వెల్కమ్ చెప్పారు. కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ని గ్రాండ్ గా పరిచయం చేశారు. 


దాదాపు రెండు నెలల తర్వాత లోకానికి తన ముఖం చూపించాడు సాయి ధరమ్ తేజ్. బైక్ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ కి తీవ్ర గాయాలు కాగా, నెలరోజులు పైగా ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ప్రమాదం జరిగిన రెండు వారాలకు కూడా సాయి ధరమ్ స్పృహలోకి రాలేదు. పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ (Republic) మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో మాటల్లో మాటగా ఈ విషయం చెప్పారు. దీంతో సాయి ధరమ్ తేజ్ కి ఏమవుతుందో అని ఫ్యాన్స్ ఆందోళన చెందారు. 

అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రార్ధనలతో సాయి ధరమ్ పూర్తిగా కోలుకున్నాడు. నిన్న మెగా హీరోలందరూ ఆయనకు వెల్కమ్ చెప్పారు. కోలుకున్న సాయి ధరమ్ తేజ్ ని గ్రాండ్ గా పరిచయం చేశారు. చిరంజీవి, పవన్ (Pawan kalyan), అల్లు అర్జున్, రామ్ చరణ్, వైష్ణవ్, వరుణ్, నాగబాబు అందరూ కలిసి సాయి ధరమ్ తో ఫోటో దిగారు. తమ కుటుంబ సభ్యుడు పెను ప్రమాదం నుండి బయటపడిన కారణంగా ఆనందం వ్యక్తం చేశారు. 

Latest Videos

undefined

రెండు నెలల  తర్వాత కెమెరా ముందుకు వచ్చిన సాయి ధరమ్ తేజ్ లో పూర్తి చేంజ్ కనిపించింది. ఆయన చాలా సన్నబడ్డారు. ప్రమాదం జరిగే సమయానికి సాయి ధరమ్ కొంచెం వళ్ళు చేసి ఉన్నారు. ట్రీట్మెంట్ సమయంలో ఆయన బరువు కోల్పోయినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది. సాయి ధరమ్ అప్పటి లుక్ కంటే స్లిమ్ గా ఇప్పుడు హ్యాండ్ సమ్ గా ఉండడం విశేషం. ప్రమాదం కారణంగా సాయి ధరమ్ పేస్, బాడీ షేప్ అవుట్ అయ్యాయని, అందుకే ఆయన ఫోటో బయటికి రాకుండా మెగా ఫ్యామిలీ జాగ్రత్త పడుతుందంటూ ఊహాగానాలు నడిచాయి, వాటన్నింటికీ చెక్ పెట్టినట్లు అయింది. 

సెప్టెంబర్ 10 వినాయక చవితి నాడు సాయి ధరమ్ బైక్ ప్రమాదానికి గురయ్యారు. వెంటనే ఆయనను మెడికవర్ ఆసుపత్రికి అంబులెన్సు లో తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. సాయి ధరమ్ కాలర్ బోన్ ఫ్రాక్చర్ అయినట్లు, అంతర్గత ప్రధాన అవయవాలకు ఎటువంటి గాయాలు కాలేదని, బులెటిన్ విడుదల చేశారు. నెలరోజులకు పైగా సాయి ధరమ్ అపోలో చికిత్స తీసుకున్నారు. ఇక తన కొత్త సినిమాల షూటింగ్ కి సాయి ధరమ్ సిద్ధం అవుతున్నారు. త్వరలోనే ఆయన షూటింగ్ సెట్స్ లో జాయిన్ కానున్నారు. 

Also read Mega 154 Update: బిగ్ బాస్ ఊర మాస్ అవతార్

ప్రతిరోజూ పండగే చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సాయి ధరమ్ మరలా వెనుకబడ్డారు. ఆయన గత చిత్రాలు రెండూ... అనుకున్నంత విజయం సాధించలేదు. సోలో బ్రతుకే సో బెటర్ యావరేజ్ టాక్ తెచ్చుకోగా, రిపబ్లిక్  ప్లాప్  ఖాతాలోకి చేరింది. 

Also read నటిగా అమృత ప్రణయ్... యూట్యూబ్ సాంగ్ లో డాన్స్ చేస్తూ కనిపించి షాక్ ఇచ్చిన మీడియా సెన్సేషన్

click me!