రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌ నీల్‌ నెక్ట్స్ మూవీ... అక్కడ ఈ రేంజ్‌ హీరోలు లేరా?

Published : Dec 06, 2020, 08:58 AM IST
రామ్‌చరణ్‌తో ప్రశాంత్‌ నీల్‌ నెక్ట్స్ మూవీ... అక్కడ ఈ రేంజ్‌ హీరోలు లేరా?

సారాంశం

ప్రశాంత్‌ మరో సినిమాకి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ఆయన సినిమా చేయనున్నారట. ఇటీవల రామ్‌చరణ్‌కి ప్రశాంత్‌ నీల్‌ ఓ కథ చెప్పారని, దానికి చిరంజీవి కూడా ఇంప్రెస్‌ అయ్యారని తెలుస్తుంది. 

`కేజీఎఫ్‌` చిత్రంతో అందరి దృష్టిని ఆకర్షించాడు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయన ప్రస్తుతం `కేజీఎఫ్‌ః ఛాప్టర్‌ 2`ని తెరకెక్కిస్తున్నారు. ఇది వచ్చే ఏడాది విడుదల కానుంది. ఈ క్రమంలోనే మరో సినిమాని ప్రకటించాడు. ప్రభాస్‌తో `సలార్‌` మూవీ చేయబోతున్నట్టు వెల్లడించారు. `కేజీఎఫ్‌` నిర్మాత విజయ్‌ కిరందూర్‌ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. 

ఇదిలా ఉంటే ప్రశాంత్‌ మరో సినిమాకి కమిట్‌ అయినట్టు తెలుస్తుంది. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌తో ఆయన సినిమా చేయనున్నారట. ఇటీవల రామ్‌చరణ్‌కి ప్రశాంత్‌ నీల్‌ ఓ కథ చెప్పారని, దానికి చిరంజీవి కూడా ఇంప్రెస్‌ అయ్యారని, అన్ని కుదిరితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రానుందనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తుంది. ఇది కూడా పాన్‌ ఇండియా చిత్రంగా ఉండబోతుందని టాక్‌. 

ఇదిలా ఉంటే ప్రశాంత్‌ నీల్‌ .. ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నారనే వార్త వినిపించినప్పుడే కన్నడ అభిమానులు ఆయనపై విమర్శలు గుప్పించారు. కన్నడ పరిశ్రమని వదిలేసి ఇతర భాషల్లోకి వెళ్లడం ఎందుకు అని ప్రశ్నించారు. కానీ ఇప్పుడు ప్రశాంత్‌ నీల్‌ వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. అంటే ఆయన రేంజ్‌కి సరిపడ హీరోలు కన్నడంలో లేరా? అనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. 

ఇదిలా ఉంటే ప్రస్తుతం రామ్‌చరణ్‌ `ఆర్‌ ఆర్‌ ఆర్‌`లో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ మరో హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పాన్‌ ఇండియా చిత్రంగానే రూపొందుతుంది. ఇది వచ్చే ఏడాది సమ్మర్‌లో విడుదల కానుంది. ఆ తర్వాత రామ్‌చరణ్‌ ఎవరితో అనేది ఇంకా కన్ఫమ్‌ కాలేదు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌తో సినిమా అనే వార్త ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?