
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ రిలీజ్ కి ముందే రికార్డుల మోత మోగిస్తుంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే కోట్లు కొల్లగొడుతుంది. తాజాగా ఈ చిత్రం ఇండియాలో అడ్వాన్స్ సేల్స్ ద్వారా భారీగా వసూళ్లని రాబట్టింది. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు ఈ సినిమా ఇండియాలో ప్రీ సేల్స్ ద్వారా ఏకంగా ముప్పై కోట్లు రాబట్టడం విశేషం. ఇది ఇండియన్ సినిమా హిస్టరీలోనే మొదటిసారి కావడం విశేషం. ఇందులో తెలుగులోనే 16కోట్లకుపైగా ఉండటం మరో విశేషం. దీంతో రిలీజ్ కి ముందే ఈ సినిమా సంచలనాలు క్రియేట్ చేస్తుందని చెప్పొచ్చు.
ఇప్పుడు మొత్తం `ఆదిపురుష్` మేనియా కొనసాగుతుంది. ఈ ఫీవర్ ఏం రేంజ్‌లో ఉందంటే ఐమాక్స్ చరిత్రలో ఇప్పటి వరకు చేయనటువంటి విధంగా ఇందులో బెనిఫిట్ షోస్ పడుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమాక్స్ లో ఈ బెనిఫిట్ షోస్ వేస్తున్నారు. ప్రమోషనల్ కంపెనీ శ్రేయాస్ మీడియా దీన్ని లీడ్ చేస్తుంది. శుక్రవారం తెల్లవారు జామున 4 గంటలకు ఏకంగా ఆరు స్క్రీన్లలో బెనిఫిట్ షోస్ వేస్తుండటం విశేషం.
మొదట 3.56 గంటలకు పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం 4 గంటలకు షోస్ ప్రదర్శిస్తున్నారు. ఐమాక్స్ లోని అన్ని స్క్రీన్లలో `ఆదిపురుష్`ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ ఐమాక్స్ ఇలా ఇలాంటి బెనిఫిట్ షోస్ లేవు. కానీ ఇప్పుడు వేయడం ఆశ్చర్యపరుస్తుంది. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రతి థియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీట్‌ని ఖాళీగా ఉంచుతున్నారు. అయితే వాటి పక్కన సీట్లకి మాత్రం బంపర్ ఆఫర్ పెట్టారు. హనుమంతుడి పక్క సీట్లకి టికెట్ రేట్ ఐదు వందలుగా నిర్ణయించినట్టుగా సమాచారం.
ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ ట్రా షోస్‌కి పర్మీషన్ ఇచ్చింది. అలాగే రూ టికెట్‌పై రూ.50 పెంచుకునే వెసులుబాటుని కల్పించింది. ఏపీ ప్రభుత్వం కూడా యాభై రూపాయలు పెంచుకునేందుకు పర్మీషన్ ఇచ్చింది. కానీ ఎక్స్ ట్రా షోస్‌కి మాత్రం పర్మీషన్స్ ఇవ్వలేదు. కానీ అనధికారంగా మాత్రం అక్కడ భారీగానే బెనిఫిట్ షోస్ పడే అవకాశం ఉందని తెలుస్తుంది.
మొదటి సారి ప్రభాస్ పౌరాణిక పాత్ర అయిన రాముడిగా నటిస్తున్న నేపథ్యంలో `ఆదిపురుష్` చిత్రంపై భారీ అంచనాలున్నాయి. రాముడిగా ప్రభాస్‌ని చూడాలని ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు.సీత పాత్రలో కృతి సనన్ నటిస్తున్నారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. టీ సిరీస్,యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా భారీగా బిజినెస్ చేసింది. ఇక ఓపెనింగ్ ఏ రేంజ్‌లో ఉంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అందుకోసం ట్రేడ్ వర్గాలు ఆసక్తికరంగా చూస్తున్నాయి.