
ప్రభాస్ భోళా శంకరుడు. ప్రేమైనా, ఆహారమైనా, బహుమతులైనా ఊహించిన దానికి మించి అందిస్తాడు. తాజాగా ఆయన చేసిన పని హాట్ టాపిక్ అవుతుంది. ప్రభాస్ సలార్ మూవీ టీమ్ కి ఊహించని గిఫ్ట్ ఇచ్చాడట. ఈ చిత్ర సహాయ సిబ్బంది అకౌంట్స్ లో రూ. 10 వేలు చొప్పున జమ చేశాడట. తమకు ఎలాంటి సమాచారం లేకుండా అకౌంట్స్ లో డబ్బులు డిపాజిట్ కావడంతో వారు ఆశ్చర్యానికి గురయ్యారట. అనంతరం విషయం తెలుసుకుని ప్రభాస్ కి కృతజ్ఞతలు తెలియజేశారట.
ఆదిపురుష్ చిత్ర విడుదలకు ముందు సలార్ చిత్రానికి పని చేసిన సిబ్బందికి డబ్బులు బహుమతులుగా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. బహుశా ఆదిపురుష్ మూవీ కుటుంబ సమేతంగా చూసేందుకు ఆయన ఈ ఏర్పాటు చేశారేమో తెలియదు. ఇక సెట్స్ లో కూడా ప్రభాస్ తన తోటి నటులను ప్రేమగా చూసుకుంటారు. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన పదార్థాలతో మంచి భోజనం ఏర్పాటు చేస్తారు.
తనతో జతకట్టిన హీరోయిన్స్ కి ప్రపంచ ప్రసిద్ధ వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడం ప్రభాస్ కి అలవాటు. ఇక సంక్షోభ సమయాల్లో ప్రభాస్ కోట్లలో ప్రభుత్వాలకు సహాయం చేస్తారు. మిగతా హీరోలు లక్షలు ఇస్తుంటే, ఆయన మాత్రం కోట్లు విరాళంగా ఇస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రభాస్ మంచి పనులు అనేకం ఉన్నాయి.
జూన్ 16న ఆదిపురుష్ థియేటర్స్ లో విడుదలవుతుంది. ప్రభాస్ మొదటిసారి రాముడు పాత్ర చేశారు. కృతి సనన్ జానకిగా నటించారు. ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రానికి దర్శకుడు. సైఫ్ అలీ ఖాన్ కీలకమైన రావణాసురుడు పాత్ర చేశారు. అజయ్-అతుల్ సంగీతం అందించారు.ఆదిపురుష్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.