పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్నమోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ OG నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ సెట్స్ కు హాజరైనట్టు తెలిపారు.
యంగ్ డైరెక్టర్ సుజీత్ ‘సాహో’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దాంతో తర్వాత ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను గ్యాంగ్ స్టర్ గా చూపిస్తూ ఓ భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రానికి OG (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్) అని టైటిల్ ను కూడా ఖరారు చేశారు. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా గా రూపుదిద్దుకుంటోంది. ముంబై గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో రాబోతున్న మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ కీలకమైన ఎపిసోడ్లను పూర్తి చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వపన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పొటిలికల్ ప్రొగ్రామ్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా OG టీమ్ మిగితా నటీనటులతో షూటింగ్ కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా స్టార్ యాక్టర్లతో షూట్ చేస్తున్నట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ అందిస్తున్నారు. ఇప్పటికే తమిళ స్టార్ నటుడు అర్జున్ దాస్ మరియు పవర్ ఫుల్ లేడీ శ్రియా రెడ్డి కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారని అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక తాజాగా మరో స్టార్ హీరో కూడా జాయిన్ అయినట్టు వెల్లడించారు.
బాలీవుడ్ టాలెంటెడ్ అండ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi) ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. పవన్ కు విలన్ గా అలరించబోతున్నారని తెలిపారు. ఈ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు సర్ ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే బాలీవుడ్ లో ఎన్నో చిత్రాల్లో నటించిన మెప్పించిన ఇమ్రాన్ హష్మీ తొలిసారిగా పవన్ కళ్యాణ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు. నిజానికి ఇదీ ఆడియెన్స్ కు యూనిట్ నుంచి ఆశ్చర్యపరిచే అప్డేట్ అని చెప్పవచ్చు..
మరోవైపు సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను మునుపెన్నడూ లేని వయలెన్స్ లో చూపించబోతున్నారంట. ఇప్పటికే మేకర్స్ ఈమేరకు హైప్ కూడా క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ముంబైలో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ముంబై, పూణేలలో షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. సాలిడ్ యాక్షన్ సీన్స్ ను, ఓ సాంగ్ ను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ప్రియాంక అరుళ్ మోహన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
When we have the , we should also have a badass who is powerful and striking… 🔥🔥🤙🏻
Presenting you all, the nemesis ! 🔥 💥 pic.twitter.com/CmBBTFvSdR