యూఎస్ఏలో ‘ఆదిపురుష్‘ రికార్డు కలెక్షన్స్.. రెండ్రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

By Asianet News  |  First Published Jun 17, 2023, 11:07 AM IST

‘ఆదిపురుష్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద మైథలాజికల్ ఫిల్మ్ భారీ మార్క్ ను దాటింది. రెండు రోజుల్లో యూఎస్ఏ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
 


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)  రాముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘ఆదిపురుష్’. బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ (Kriti Sanon) జానకీ పాత్రలో నటించింది. హిందీ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేశారు. హిందూ పురణాల్లోని రామాయణం ఆధారంగా తెరకెక్కింది. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నిర్మించారు. జూన్ 16న (నిన్న) ప్రపంచ వ్యాప్తంగా 9వేల థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మాత్రం మిశ్రమ స్పందనను దక్కించుకుంది.

కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం Adipurush   మంచి కలెక్షన్లను రాబడుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఈ మూవీ వసూళ్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. మొదటి రోజు ఆదిపురుష్ ఏకంగా 1 మిలియన్ యూఎస్ డీకి పైగా వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ఒక్కరోజులోనే ఈ మార్కును దాటడం రికార్డు అనే చెప్పాలి.  ట్రెండ్ వర్గాల అంచనా ప్రకారం.. ఆదిపురుష్ రెండో రోజు యూఎస్ఏలో 3 మిలియన్ల డాలర్లను వసూల్ చేసిందని తెలుస్తోంది. ఓవర్సీస్ లో మొత్తంగా మూడు మిలియన్ల వరకు సాధించి కలెక్షన్ల పరంగా మాత్రం హౌరా అనిపిస్తోంది.

Latest Videos

undefined

ఇక మొదటి రోజు వైల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.80 నుంచి రూ.110 కోట్లకు పైగా వసూల్ చేసిందని ట్రేండ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎన్నో విమర్శలను దాటుకొని థియేటర్లోకి వచ్చిన చిత్రం ఈ భారీ మార్క్ ను దాటడం విశేషమనే చెప్పాలి. ఇక ఇవ్వాళ, రేపు వీకెండ్ కావడంతో దాదాపు రూ.300 కోట్ల వరకు వసూళ్లు రానున్నాయని అంటున్నారు. టాక్ ఎలాఉన్నప్పటికీ చిత్రం కలెక్షన్ల పరంగా మాత్రం దుమ్ములేపుతుందని అర్థం అవుతోంది. 

మరోవైపు ప్రభాస్ కెరీర్ లో ఇప్పటి వరకు బాహుబలి 2, సాహో ఓపెనింగ్ డే కలెక్షన్లు రూ.100 కోట్లు దాటాయి. ఇప్పుడు ఆ వరుసలో ఆదిపురుష్ కూడా నిలిచిందని అంటున్నారు. మరోవైపు హిందీలోనూ గట్టి వసూళ్లు రాబట్టిందని తెలుస్తోంది. ఇక తెలుగు స్టేట్స్ లో నైజాం - రూ.50 కోట్లు, విశాఖ పట్నం - 12.5 కోట్లు, ఈస్ట్ రూ.8 కోట్లు, వెస్ట్ రూ.7 కోట్లు, కృష్ణా రూ.7.5 కోట్లు, గుంటూరు - రూ.9 కోట్లు, నెల్లూరు - రూ.4 కోట్లు, సీడెడ్ రూ.17.5 కోట్లు వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. 

 

smashes all the records!! Collects 1 Million + USD Day on First Day! 🙏🏹 … pic.twitter.com/YlyHDgmmyk

— People Media Factory (@peoplemediafcy)
click me!