‘ఆదిపురుష్‌’ఎఫెక్ట్... ప్రశాంత్ వర్మ ముందు జాగ్రత్త స్టేట్మెంట్

Published : Jun 17, 2023, 10:24 AM IST
 ‘ఆదిపురుష్‌’ఎఫెక్ట్... ప్రశాంత్ వర్మ ముందు జాగ్రత్త స్టేట్మెంట్

సారాంశం

ప్రశాంత్ వర్మ హనుమాన్ కూడా ఆదిపురుష్ లాగ ఉంటుందా..కొత్తదనం పేరుతో మొత్తం మార్చేయటం లేదు కదా ఇదీ టాలీవుడ్ జనం అనుమానం.. ఈ విషయమై ప్రశాంత్ వర్మ స్పందించారు.  

 


ప్రభాస్ నటించిన ఆదిపురుష్ నిన్న శుక్రవారం భారీ ఎత్తున రిలీజైంది. ఈ సినిమాకు ప్రశంసలు కన్నా విమర్శలే ఎక్కువ వచ్చాయి. రామాయణాన్ని మార్చేసారని, పాత్రల గెటప్ ల నుంచి ఛేంజెస్ చేసారని  అందరూ అన్నారు.  ఆదిపురుష్ ను ఈ జనరేషన్ కు తగ్గట్టు మోడ్రన్ గా తెరకెక్కించారని అభిమానులు చెప్పుకొస్తున్నా ఫలితం లేకుండా పోయింది. అందరికీ తెలిసిన రామాయణం వేరు.. ఆదిపురుష్ రామాయణం వేరు అంటూ పెదవి విరుస్తున్నారు. ఈ క్రమంలో  అందరి చూపు హనుమాన్ మీద పడింది. ఇక ఈ నేపథ్యంలోనే తమ సినిమా హనుమాన్ గురించి ప్రశాంత్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు.  ముందు జాగ్రత్తపడే ప్రయత్నం చేసాడు.

దర్శకుడు ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ....  మేము సినిమా మొదలుపెట్టినప్పుడు ‘ఆదిపురుష్‌’ (Adipurush) లేదు. అయినా ఒక సినిమా ప్రభావం మరోదానిపై పడుతుందని నేను అనుకోను. సాధ్యమైనంత వరకు కష్టపడుతున్నాం. మా సినిమాకు మొదటి నుంచి కూడా మేము అనుకున్నదాని కంటే 10 రెట్లు ఎక్కువ స్పందన వస్తోంది. దానికి తగట్లుగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందని కచ్చితంగా నమ్ముతున్నాం అన్నారు.

అలాగే ” మేము రిస్క్ చేయడం లేదు. హనుమాన్ ను మోడ్రనైజ్ చేసి చూపించడం లేదు. చిన్నతనం నుంచి హనుమంతుడు అందరికి ఎలా తెలుసో.. అలాగే చూపిస్తున్నాను.హనుమంతుని పాత్ర కోసం మేమందరం ఏడాది పాటు రీసెర్చ్ చేసాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.  

ఇక డైరక్టర్  ప్రశాంత్‌ వర్మ (Prasanth Varma) కొత్త కాన్సెప్ట్‌లతో సినిమాలు తీస్తూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. త్వరలోనే ‘హను-మాన్‌’ (Hanuman)తో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు.  టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ఏకంగా 11 భాషల్లో రిలీజ్‌ కానుంది. 
 

 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?