Tribeca Film Festival 2023: ఆదిపురుష్ చిత్రానికి అంతర్జాతీయ గౌరవం... స్పందించిన ప్రభాస్!

Published : Apr 19, 2023, 08:46 AM IST
Tribeca Film Festival 2023:  ఆదిపురుష్ చిత్రానికి అంతర్జాతీయ గౌరవం... స్పందించిన ప్రభాస్!

సారాంశం

ఆదిపురుష్ మూవీ ప్రఖ్యాత ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ నందు ప్రదర్శనకు అర్హత పొందింది. ఈ క్రమంలో ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా తన ఆనందం పంచుకున్నారు.   

న్యూయార్క్ వేదికగా ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ 2023 జరగనుంది. జూన్ 7 నుండి 18 వరకు వివిధ దేశాలకు చెందిన చిత్రాలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రఖ్యాత వరల్డ్ ఫిల్మ్ ఫెస్టివల్ కి ఆదిపురుష్ అర్హత సాధించింది. ట్రిబెక 2023 నందు ఆదిపురుష్ చిత్ర ప్రదర్శన జరగనుంది. జూన్ 13న ట్రిబెక ఫిల్మ్ ఫెస్టివల్ నందు ఆదిపురుష్ మూవీ ప్రీమియర్ వేయనున్నారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. 

ఆదిపురుష్ మూవీ అరుదైన ఘనత సాధించిన నేపథ్యంలో హీరో ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ మూవీ జూన్ 16న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ప్రభాస్ కెరీర్లో మొదటిసారి పౌరాణిక చిత్రం చేస్తున్నారు. ఆయన రామునిగా అలరించనున్నారు. సీత పాత్రలో ప్రభాస్ కి జంటగా కృతి సనన్ నటిస్తున్నారు. ఇక విలన్ రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. 

సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సిన ఆదిపురుష్ వాయిదా పడింది. ఆదిపురుష్ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకుడు. ఈ మూవీ విషయంలో ఆయన విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది ఆదిపురుష్ టీజర్ విడుదల చేయగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ లుక్స్ విమర్శలపాలయ్యాయి. ముఖ్యంగా టీజర్లో విఎఫ్ఎక్స్ చాలా నాసిరకంగా ఉంది. కార్టూన్ మూవీని తలపించిందంటూ ఆరోపణలు వినిపించాయి. ఆదిపురుష్ మూవీ ఫలితం ఎలా ఉంటుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. బాహుబలి 2 అనంతరం ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ నిరాశపరిచాయి. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..