
అక్కినేని అఖిల్ హీరోగా.. స్టార్ మేకర్ సురేందర్ రెడ్డిల క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఏజెంట్. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉందీ మూవీ. దాదాపు రెండేళ్లకు పైగా షూటింగ్ జరుపుకున్న ఈసినిమా ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయ్యింది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. మేకర్స్ ప్రమోషన్స్ జోరును పెంచేశారు. ఈసారి ఎలాగైనా సినిమా సక్సెస్ సాధించాలని తపనతో ఉన్నాడు అఖిల్. గతంలో తాను చేసిన సినిమాలన్నీ.. హీరోగా తనను నిలబెట్టక పోవడంతో.. ఈసినిమా కోసం గట్టిగా కష్టపడ్డాడు అఖిల్. ఈ సినిమా సక్సెస్ అఖిల్ కు చాలా ఇంపార్టెంట్.. అందుకే ప్రమోషన్స్ ను డిఫరెంట్ గా.. కొత్తగా ప్లాన్ చేస్తున్నారు.
ఇక ప్రమోషన్లలో భాగంగా.. ఏజంట్ మూవీ నుంచి థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్. కాకినాడలో జరిగిన ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా ఈ వీడియోను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని మేకర్స్ ఇంతకుముందే అనౌన్స్ చేశారు. ట్రైలర్ లో హాలీవుడ్ హీరోలా కనినించాడు అఖిల్. ట్రైలర్ కూడా ఆసాంతం హాలీవుడ్ సినిమా చూస్తున్న విధంగా డిజైన్ చేశారు. ఇక అఖిల్ కష్టం అంతా అతని సిక్స్ ప్యాక్ లో కనిపిస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ కోసం బాగా.. హార్డ్ వర్క్ చేశాడు అఖిల్. అదంతా ట్రైలర్ లో కనిపించింది. ఇక మమ్ముట్టిని ఇలాంటి గెటప్ లో ఎప్పుడూ చూసి ఉండరు. అలా డిఫరెంట్ గా మేకోవర్ చేశాడు దర్శకుడు. యాక్షన్ సీక్వెన్స్ లతో ఏజంట్ ట్రైలర్ అద్భుతంగా ఉంది. సినిమా ఎలా ఉంటుందోచూడాలి. ట్రైలర్ మాత్రం నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది.
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ ను ఎంతగానో అలరించింది. అఖిల్ లుక్, డైలాగ్స్ ఇంతకుముందులా కాకుండా మెచ్యూరిటీ కనిపించింది. గెటప్, డైలాగులు, యాక్షన్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఇన్నాళ్లు లవర్ బాయ్ లా.. ప్లే బాయ్ లా కనిపించిన అఖిల్.. కంప్లీట్ గా చేంజ్ అయ్యి.. ఒక పవర్ఫుల్ పాత్రలో నటించాడు. ఈ ట్రైలర్ చూస్తే.. అఖిల్ ఎంతగా మేకోవర్ అయ్యాడో కనిపిస్తుంది. ఈసినిమా అఖిల్ కు చాలా ఇంపార్టెంట్.. ఈమూవీ హిట్ అయితే.. అఖిల్ ఊపిరిపీల్చుకోవడంతో పాటు.. యాక్షన్ హీరోగా అఖిల్ కు టాలీవుడ్ లో కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది.
ఇక ఇతర ప్రమోషన్ ఈవెంట్స్ ను కూడా అఖిల్ డిఫరెంట్ గా చేస్తున్నాడు,. రీసెంట్ గా ట్రైలర్ రిలీజ్ పోస్టర్ లాంచ్ సందర్భంగా అఖిల్ అద్బుతమైన ఫీట్ చేశాడు. 172 అడుగుల ఎత్తు ఉండే PVP బిల్డింగ్ నుంచి రోప్ సహాయంతో ఏజెంట్ మోడ్ లో అఖిల్ డైవ్ చేస్తూ కిందకు దిగాడు. ఈ ఫీట్ కు ఫిదా అయ్యారు అక్కినేని ఫ్యాన్స్.. ఈవీడియో కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇక ట్రైలర్ తో మరో మెట్టు ఎక్కిన అఖిల్.. సినిమాతో తనను తాను ఫ్రూ చేసుకుంటాడా లేదా అనేది చూడాలి.