దివ్యాంశ కౌశిక్‌‌తో సిద్దార్థ్ ఘాటు రొమాన్స్... రెచ్చిపోయి రచ్చ చేశారుగా..

Published : Apr 18, 2023, 08:19 PM ISTUpdated : Apr 18, 2023, 08:22 PM IST
దివ్యాంశ కౌశిక్‌‌తో సిద్దార్థ్ ఘాటు రొమాన్స్... రెచ్చిపోయి రచ్చ చేశారుగా..

సారాంశం

బొమ్మరిల్లు బాబు సిద్థార్ద్ రొమాంన్స్ డోస్ పెంచుతూ పోతున్నాడు. వయస్సు పెరుగుతంటే.. కుర్ర హీరోలను మించి హీరోయిన్లతో హట్ సీన్స్ చేస్తున్నాడు. తాజాగా ఓ ట్రైలర్ లో దివ్యాంశ కౌశిక్‌‌తో రెచ్చిపోయి రచ్చ రచ్చ చేశాడు హీరో సిద్థార్ద్.

లవర్ బాయ్ గా అమ్మాయిల మనసు దోచిన హీరో సిద్దార్థ్... ఇప్పుడు రొమాంటిక్ డోస్ పెంచేస్తున్నాడు.  టాలీవుడ్ ను వదిలి కంప్లీట్ గా  కోలీవుడ్ కి పరిమితం అయి హీరో.. తమిళంలోనే సినిమాలు చేసుకుంటూ..  అక్కడే ఉండిపోయాడు. టాలీవుడ్ పై కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసి.. తెలుగులో అవకాశాలుకోల్పోయాడుసిద్దు. ఆతరువాత కొంత కాలానికి అడపాదడపా తెలుగు సినిమాలో ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాడు. చివరిగా తెలుగులో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం సినిమాలో నటించాడు. 

ఇక తాజాగా  సిద్దార్థ్ బర్త్ డే సందర్భంగా సిద్దార్థ్ కు సబంధించిన పోస్టర్లు.. టీజర్లు.. రిలీజ్ చేశారు. సిద్థార్ద్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అదితి రావ్ హైదరీ.. కూడా సిద్థార్ద్ కు  ఎమోషనల్ గా పోస్ట్ వేసి.. బర్త్ డే విషెస్ చెప్పింది. ఇక ఈ క్రమంలో సిద్దార్థ్ నటించిన టక్కర్‌ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు టీమ్. అయితే ఈ మూవీ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది... కాని కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆగిపోయింది.  అయితే ఈసినిమా పని అయిపోయింది అనుకున్నారంతా.. కాని తాజాగా సిద్థార్ధ్ బర్త్ డేకి సర్ ప్రైజ్ ఇస్తూ.. టీజర్ ను రిలీజ్ చేశారు టీమ్. 

 

ఇక ఈసినిమాలో హీరోయిన్ గా  దివ్యాంశ కౌశిక్‌‌ నటిస్తుంది. ఈ సినిమాలో రొమాన్స్ డోస్ ను గట్టిగా పెంచేశాడు సిద్థార్ద్. ఈ టీజర్ లో దివ్యాంశ కౌశిక్‌‌తో సిద్దార్థ్ రొమాన్స్ మాములుగా లేదు. ఘాటు ఘాటు ముద్దులు.. హగ్గులు.. అదిరిపోయేలా హాట్ సీన్ లో జీవించేశారు ఇద్దరు తారలు. టీజర్ లో ఈ సీన్స్ యూత్ ని గట్టిగా  ఆకట్టుకుంటుంది. 

ఇక ఈసినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తుండగా.. నివాస్ కే ప్రసన్న సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ కానుకగా మే 26న ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. కాగా సిద్దార్థ్ నటిస్తున్న మరో సినిమా ఇండియన్ 2 . శంకర్, కమల్ హాసన్ కలయికలో వస్తున్న ఈ మూవీలో సిద్దార్థ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.ఇటు తెలుగులో కూడా సిద్థార్ద్ సినిమాలకోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాకపోతే మహాసముద్రం ప్లాప్ తో.. సిద్దార్ధ్ కు అవకాశాలు తగ్గిపోయాయి. 

PREV
click me!

Recommended Stories

చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేశారు, ఇమ్మాన్యుయేల్ కి మొండి చేయి.. బిగ్ బాస్ పై దుమ్మెత్తి పోస్తున్న రోహిణి
చిరంజీవి సినిమా హిట్ అని చెప్పుకున్నారు, కానీ అది ఫ్లాప్.. కుట్ర చేసినందుకు తగిన శాస్తి జరిగిందా ?