
హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కి తిరుగులేదు అన్నట్లుగా ఒకప్పుడు ఆమె హవా సాగింది. కానీ ఇప్పుడు రకుల్ కి అవకాశాలు తగ్గాయి. రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ లో స్టార్ హీరోల చిత్రాల్లో నటించింది. ఇటీవల రకుల్ కి ఆఫర్స్ తగ్గినప్పటికీ అభిమానుల్లో ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు.
సోషల్ మీడియాలో రకుల్ ఎప్పుడూ తన గ్లామర్ పిక్స్ తో సర్ ప్రైజ్ లు ఇస్తూనే ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ ఎప్పుడూ అందంగా కనిపించేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ టూ పీస్ బికినీలో ఫ్యాన్స్ కి పరువాల విందు వడ్డిస్తోంది.
తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ హుండాయ్ ఇండియా కల్చరల్ వీక్ షోలో పాల్గొంది. ఈ షోలోకి పాల్గొనేందుకు వెళుతుండగా రకుల్ స్టెప్స్ ఎక్కుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సోషల్ మీడియాలో చిన్న విషయం కూడా బూతద్దంలో చూపినట్లు పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పుడు రకుల్ విషయంలో కూడా అదే జరిగింది.
ఆమె పింక్ కలర్ లో క్లీవేజ్ అందాలు ఒలకబోసేలా ఉన్న లాంగ్ గౌన్ ధరించింది. గౌన్ చాలా పొడవు ఉండడంతో ఆమె నార్మల్ గా స్టెప్స్ ఎక్కడం కష్టం. దీనితో ఆమె అసిస్టెంట్స్ సాయం చేశారు. రకుల్ స్టెప్స్ ఎక్కుతుంటే ఆ గౌను ఆమె కాళ్లకు తగలకుండా ఓ అసిస్టెంట్ ఎత్తి పట్టుకున్నాడు. ఇది చూడడానికి కాస్త ఇబ్బంది కరంగా కనిపిస్తోంది. పాపం అతడు రకుల్ కి సాయం చేస్తున్నప్పటికీ.. వెనుక నుంచి అలా పట్టుకోవడంతో నెటిజన్లకు ఇబ్బందికరంగా అనిపిస్తోంది.
దీనితో ఈ వీడియో చూడడానికి ఇబ్బందికరంగా ఉందని.. ఆమె గౌనుని పట్టుకొనే భాద్యత మహిళా అసిస్టెంట్ కి ఇచ్చి ఉంటే బావుండేది అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.