పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - సుజీత్ కాంబోలోని OG నుంచి క్రేజీ అప్డేట్స్ అందిస్తున్నారు యూనిట్. చిత్రంలో నటిస్తున్న టాలెంటెడ్ యాక్టర్లను ప్రకటిస్తూ వస్తున్నారు. తాజాగా కోలీవుడ్ కు చెందిన పవర్ ఫుల్ లేడీకి స్వాగతం పలుకుతూ అప్టేట్ ఇచ్చారు.
‘సాహో’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ కొంచెం గ్యాప్ తర్వాత భారీ ప్రాజెక్ట్ ను తెరకెక్కించబోతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘OG’. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామా గా రూపుదిద్దుకుంటోంది. ముంబై గ్యాంగ్ స్టర్ నేపథ్యంలోని చిత్రం తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ వయలెన్స్ నెక్ట్స్ లెవల్లో ఉంటుందంటూ ఇప్పటికే మేకర్స్ హైప్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇలీవల చిత్రం నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అందిస్తున్నారు. చిత్రంలో నటిస్తున్న టాలెంటెడ్ యాక్టర్లను ఒక్కొక్కరిగా ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలో తమిళ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) పవన్ సరసన నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిన్న టాలెంటెడ్ యాక్టర్ అర్జున్ దాస్ (Arjun Das) కూడా కీలక పాత్ర పోషిస్టున్నట్టు తెలిపారు. తాజాగా కోలీవుడ్ కు చెందిన పవర్ ఫుల్ లేడీ శ్రియా రెడ్డి (Sriya Reddy) కూడా పవర్ యాక్షన్ రోల్ లో నటిస్తుందని అధికారికంగా వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రియాను OG యూనిట్ స్వాగతించింది. చిత్రంలో తను చేసేబోయే రోల్ ప్రేక్షకులను తప్పకుండా ఆశ్చర్య పరుస్తుందని తెలిపారు. హై వోల్టేజీ యాక్షన్ తో వస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్లను ఎంపిక చేస్తుండటంతో మరింతగా అంచనాలు పెరుగుతున్నాయి. ‘ఓజీ’లో అవకాశం రావడంపై శ్రియా రెడ్డి కూడా స్పందించారు. ‘స్క్రిప్ట్ చదివిన ఐదు నిమిషాల్లోనే ఓకే చెప్పాను. అదే ఆ క్యారెక్టర్ కు ఉన్న పవర్. సుజీత్ చక్కగా రాశారు. పవన్ కళ్యాణ్ - సుజీత్ తో కలిసి పనిచేయడం ఎప్పటికీ మధురమైనదిగా ఉంటుంది. ఇక రవి కె చంద్రన్, OGకి ఒక వరం. ఇక ప్రకాష్ రాజ్ తో మళ్లీ పనిచేయడం ఆనందంగా ఉంది. OGతో బౌండరీలు బద్దలవుతాయి. కొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ అవుతాయి.‘ అంటూ తన ఫీలింగ్ ను ట్వీటర్ ద్వారా పంచుకుంది.
ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. అనౌన్స్ మెంట్ వచ్చిన వెంటనే షూటింగ్ ను ప్రారంభించారు. ఇప్పటికే ముంబై, పూణేలలో షెడ్యూల్స్ ను పూర్తి చేశారు. సాలిడ్ యాక్షన్ సీన్స్ ను, ఓ సాంగ్ ను కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లైనప్ లో ఉన్న ‘హరిహర వీరమల్లు’, సముద్రఖని దర్వకత్వంలో వస్తున్న ‘బ్రో’ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. అలాగే హరీశ్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూట్ కూడా శరవేగంగా కొనసాగుతోంది.
Welcome aboard, !
Your presence in will be a shocker and a banger. 🤙🏻 🔥 💥 pic.twitter.com/YMQwjsSk59