ప్రేమ ఎప్పుడు చరిత్రలోనే.. ఎన్టీఆర్ వదిలిన 'ఉప్పెన' ట్రైలర్‌ , ఎలా ఉందంటే

Surya Prakash   | Asianet News
Published : Feb 04, 2021, 05:15 PM IST
ప్రేమ ఎప్పుడు చరిత్రలోనే..  ఎన్టీఆర్ వదిలిన  'ఉప్పెన' ట్రైలర్‌ , ఎలా ఉందంటే

సారాంశం

మెగా ఫ్యామిలీనుంచి వస్తున్న మరో యంగ్ హీరో వైష్ణవ్ తేజ్.   ఉప్పెన సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టనున్నాడు. మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించగా.. యంగ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది.    ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా ఈ చిత్రం రిలీజ్ డేట్ ని నిర్మాతలు ప్రకటించారు. పిబ్రవరి 12 న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. అలాగే ఇప్పుడు ఈ చిత్రం ట్రైలర్ ని విడుదల చేసారు.   

ఈ ట్రైలర్ ని ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల చేసారు.  ‘‘ఈ ట్రైలర్‌ విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ‘ఆల్‌ ది బెస్ట్‌ బ్రదర్‌’’ అని తారక్‌ అన్నారు. ప్రేమంటే ఓ లైలా-మజ్నులా, దేవదాసు-పార్వతిలా, రొమియో-జూలియట్‌లా అదో మాదిరిలా ఉండాలిరా’ అనే డైలాగు బాగుంది. అలాగే విజయ్ సేతుపతి షాట్స్ ,డైలాగులు కూడా బాగున్నాయి. పేద,ధనిక మధ్య జరిగే కథలా కనిపిస్తోంది. సినిమాని నిలబెట్టే అంశంమేదో దాచినట్లున్నారు. దాన్ని రివీల్ చేయలేదు.  మీరూ ఈ ట్రైలర్ పై ఓ లుక్కేయండి.

 మైత్రీ మూవీస్‌ మేకర్స్‌ పతాకంపై నిర్మితమవుతున్నఈ చిత్రాన్నిబుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన ‘‘నీ కన్ను నీలి సముద్రం నా మనసేమే అందుట్లో పడవ ప్రయాణం’’ సాంగ్‌ ఆకట్టుకుంటోంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇందులో విజయ్‌ సేతుపతి - రాయమన్‌ అనే పాత్రలో విలన్ గా దర్శనమివ్వనున్నారు. చిత్రానికి నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, సుకుమార్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు